Pakistan Drone Magnetic Bombs : టార్గెట్ అమర్‌నాథ్ యాత్ర..! పాకిస్తాన్ కుట్రను భగ్నం చేసిన పోలీసులు

గతంలో తాలిబన్లు ఈ మాగ్నటిక్ బాంబులు వాడేవారు. అమెరికా అధికారులు, ఇతర నాయకుల కార్ల కింద వాటిని పెట్టేవారు. ఇప్పుడు వీటిని అమర్ నాథ్ యాత్రలో ఉపయోగించేలా పాకిస్తాన్ ఐఎస్ఐ కుట్ర పన్నింది.

Pakistan Drone Magnetic Bombs : టార్గెట్ అమర్‌నాథ్ యాత్ర..! పాకిస్తాన్ కుట్రను భగ్నం చేసిన పోలీసులు

Pakistan Drone Magnetic Bombs

Pakistan Drone Magnetic Bombs : అమర్‌నాథ్ యాత్ర లక్ష్యంగా పాకిస్తాన్ పన్నిన మరో కుట్రను జమ్ముకశ్మీర్ పోలీసులు భగ్నం చేశారు. పాకిస్తాన్ నుంచి ఆయుధాలు మోసుకొస్తున్న డ్రోన్ ను భారత్-పాకిస్తాన్ బోర్డర్ ప్రాంతం కతువాలోని ఓ గ్రామంలో పోలీసులు కూల్చివేశారు. ఏడు మాగ్నటిక్ బాంబులు, ఏడు యూబీజీఎల్ గ్రనేడ్ లాంచర్లను బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ స్వాధీనం చేసుకుంది.

Char Dham Yatra: 25 రోజుల్లో 99 మంది చార్‌ధామ్ యాత్రికులు మృతి.. ఎందుకిలా జ‌రుగుతుందంటే..

డ్రోన్ కదలికలను రాజ్ బాగ్ పోలీస్ సెర్చ్ పార్టీ గుర్తించింది. వెంటనే కాల్పులు జరిపి డ్రోన్ ను కూల్చివేశారు. అమర్ నాథ్ యాత్ర లక్ష్యంగా బాంబులను తరలిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మాగ్నటిక్ బాంబులను చార్ దామ్ యాత్ర బస్సులకు అమర్చాలని భావించినట్లు అనుమానిస్తున్నారు.

ఉగ్రకుట్ర భగ్నం : ముగ్గురు ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్

గతంలో తాలిబన్లు వీటిని వాడేవారు. అమెరికా అధికారులు, ఇతర నాయకుల కార్ల కింద వాటిని పెట్టేవారు. అమెరికాతో శాంతి చర్చల సమయంలో జరిపిన దాడుల్లోనే వీటిని అత్యధికంగా వినియోగించారు. ఈ బాంబులు అమర్చిన కార్లు ఎక్కడో ఒకచోట పేలుతుండేవి.

ఇప్పుడు వీటిని అమర్ నాథ్ యాత్రలో ఉపయోగించేలా పాకిస్తాన్ ఐఎస్ఐ కుట్ర పన్నింది. గతేడాది కూడా సాంబా సెక్టార్ లో ఇలాంటి బాంబులు దొరికాయి. ఫూంచ్ లో నాలుగు మాగ్నటిక్ బాంబులను భద్రతా దళాలు నిర్వీర్యం చేశాయి. మళ్లీ ఇప్పుడు ఇవి డ్రోన్ల ద్వారా భారత్ కు చేరుతున్నాయని తెలియడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.

Char Dham Yatra: 25 రోజుల్లో 99 మంది చార్‌ధామ్ యాత్రికులు మృతి.. ఎందుకిలా జ‌రుగుతుందంటే..