ఉగ్రకుట్ర భగ్నం : ముగ్గురు ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్

దేశ రాజధాని ఢిల్లీలో ఉగ్రవాదులు పన్నిన భారీ కుట్రను ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. ముగ్గురు ఐఎస్ఐ అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు. సంఘ వ్యతిరేక శక్తుల గ్యాంగ్ భారీ కుట్రకు ప్లాన్ చేస్తున్నాయంటూ నిఘా వర్గాల నుంచి ఢిల్లీ పోలీసులకు సమాచారం అందింది.

  • Published By: sreehari ,Published On : January 19, 2019 / 07:06 AM IST
ఉగ్రకుట్ర భగ్నం : ముగ్గురు ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్

దేశ రాజధాని ఢిల్లీలో ఉగ్రవాదులు పన్నిన భారీ కుట్రను ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. ముగ్గురు ఐఎస్ఐ అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు. సంఘ వ్యతిరేక శక్తుల గ్యాంగ్ భారీ కుట్రకు ప్లాన్ చేస్తున్నాయంటూ నిఘా వర్గాల నుంచి ఢిల్లీ పోలీసులకు సమాచారం అందింది.

దేశ రాజధాని ఢిల్లీలో ఉగ్రవాదులు పన్నిన భారీ కుట్రను ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. ముగ్గురు ఐఎస్ఐ అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు. సంఘ వ్యతిరేక శక్తుల గ్యాంగ్ భారీ కుట్రకు ప్లాన్ చేస్తున్నాయంటూ నిఘా వర్గాల నుంచి ఢిల్లీ పోలీసులకు సమాచారం అందింది. నిఘా వర్గాల సమాచారంతో రంగంలోకి దిగిన ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ విభాగం విస్తృతంగా తనిఖీలు చేపట్టింది. ఈ తనిఖీల్లో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

వారిలో ఇద్దరు భారతీయులు కాగా, ఒకరు అఫ్ఘాన్ జాతీయుడిగా గుర్తించారు. దక్షిణ భారత్ లో ఉగ్రదాడులకు పాల్పడేందుకు పాకిస్థాన్ కు చెందిన ఉగ్ర సంస్థ గ్యాంగ్ ప్లాన్ చేస్తున్నట్టు గుర్తించామన్నారు. ఈ భారీ ఉగ్రకుట్రకు పాకిస్థాన్ కు చెందిన గ్యాంగ్ స్టర్ రసూల్ ఖాన్ హస్తం ఉందనే ప్రాథమిక సమాచారం అందినట్టు తెలిపారు. కేరళ, తమిళనాడులోని ఆర్ఎస్ఎస్ నేతలే టార్గెట్ గా ఉగ్రదాడులు చేసి కల్లోలం సృష్టించేందుకు యత్నిస్తున్నట్టు సమాచారం ఉన్నట్టు పోలీసులు చెప్పారు.