కుంభవృష్టికి ఎగిరే నదులే కారణమా.. ప్రకృతి అందాలను ముంచేస్తున్నది ఫ్లయింగ్ రివర్లేనా?

క్లౌడ్ బరస్ట్‌కు రీజన్ ఏంటనే దానిపై ఎన్నో చర్చలు ఉన్నాయి. మేఘాలు పగిలిపోయినట్లు ఉన్నట్లుండి.. ఒక్కసారిగా ఏడాదిలో కురిసే వర్షమంతా గంటల్లోనే కురవడానికి ఫ్లయింగ్ రివర్లే కారణమంటున్నారు సైంటిస్టులు.

how flying rivers caused devastating floods in India explained here

flying rivers: వేడెక్కుతోన్న సముద్రాలు.. వెంటాడుతోన్న ముప్పు.. ప్రకృతి ప్రకోపం ఏ రూపంలో ముంచుకొస్తుందో తెలియడం లేదు. ఏ ప్రాంతాన్ని ఎప్పుడు ఏ వాతావరణ ముప్పు చుట్టుముడుతుందో అంతుచిక్కడం లేదు. ప్రళయం సృష్టించే విధ్వంసం మాత్రం అంతులేని నష్టాన్ని మిగులుస్తుంది. అనుకోకుండా మబ్బులు కమ్మేసి.. ఒక్కసారిగా కుండపోత వర్షం కురిసి..ఎత్తున ఉన్న ప్రదేశాలను కూడా నీళ్లు ముంచెత్తున్నాయి. అనుకోకుండా ఆకాశగంగ భూమి మీదకు వచ్చి.. పల్లె, పట్టణం అని తేడా లేకుండా అన్నింటిని తుడిచేస్తుంది.

గంటల వ్యవధిలోనే కుండపోత వర్షం పడితే దాన్ని క్లౌడ్ బరస్ట్ అంటున్నారు. అసలు క్లౌడ్ బరస్ట్‌కు రీజన్ ఏంటనే దానిపై ఎన్నో చర్చలు ఉన్నాయి. మేఘాలు పగిలిపోయినట్లు ఉన్నట్లుండి.. ఒక్కసారిగా ఏడాదిలో కురిసే వర్షమంతా గంటల్లోనే కురవడానికి ఫ్లయింగ్ రివర్లే కారణమంటున్నారు సైంటిస్టులు. ఆకాశంలో ఎగిరే నదులు ఉన్నాయని.. వాటి వల్లే క్లౌడ్ బరస్ట్ జరుగుతందని చెబుతున్నారు. ఆకాశంలో నదులు ఏంటి.. వాటి వల్ల కుంభవృష్టి వర్షాలు ఏంటన్నదానిపై ఎన్నో అధ్యయనాలు జరిగాయి. ఆ పరిశోధనల్లో ఊహకందని విషయాలు వెలుగులోకి వచ్చాయి.

భూమి మీదున్న నీళ్లు ఆవిరై.. 
ఈ మధ్య దేశంలోని చాలా ప్రాంతాలను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. లేటెస్ట్‌గా వయనాడ్ ప్రళయం అయితే వందలమంది ప్రాణాలను బలితీసుకుంది. హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోనూ వేలాదిమందిని సేఫ్‌గా కాపాడాల్సి వచ్చింది. అయితే ఈ ప్రాంతాల్లో ఉన్నట్లుండి వర్షాలు పడటానికి క్లౌడ్ బరస్టే కారణమని అంటున్నారు వెదర్ ఎక్స్‌పర్ట్స్. భూమి మీదున్న నీళ్లు ఆవిరై ఆకాశంలో నదిలాగా ఓ లేయర్ ఏర్పడి. ఒక్కసారిగా వర్షం రూపంలో కుంభవృష్టి వర్షానికి దారి తీస్తున్నాయని చెప్తున్నారు సైంటిస్ట్‌లు.

Also Read : వయనాడ్ తర్వాత ముప్పు ఉన్న ప్రాంతాలు ఇవేనా?

గ్లోబల్ వార్మింగ్. అంటే భూమి వేడెక్కడం. రానురాను భూతాపం పెరిగి.. తేమశాతం పడిపోతోంది. భూమి మీదన్న నీళ్లు ఆవిరై ఆకాశంలో పాయలు ఏర్పడుతున్నట్లు కొన్ని అధ్యయనాల్లో తేలింది. వీటినే ఆకాశ నదులు లేక ఫ్లయింగ్ రివర్స్ అంటున్నారు. సముద్రాల్లోని నీరు వేడెక్కి పెద్దమొత్తంలో ఆవిరిగా మారి, ఆకాశంలో కంటికి కనిపించకుండా పాయలుగా ఫామ్ అవుతున్నాయి. ఆకాశంలోని దిగువ భాగంలో ఈ నీరు పట్టీగా ఏర్పడి.. వేడి ప్రాంతం నుంచి చల్లని వాతావరణం వైపు కదులుతూ అక్కడక్కడ ఒక్కసారిగా వర్షంగా లేదా మంచుగా కురుస్తుంది. అది కాస్త భారీ వరదలకు, మంచుచరియలు విరిగిపడి విధ్వంసానికి కారణమవుతుంది.

భారతదేశంలో 574 ఆకాశ నదులు
భారత్‌లో హిందూ మహాసముద్రం వేడెక్కి.. ఆకాశంలో ఫ్లయింగ్ రివర్లు ఏర్పడి జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య వచ్చే రుతుపవనాల ప్రభావాన్ని పెంచుతున్నాయని అంటున్నారు వాతావరణ నిపుణులు. 2023 నేచర్ జర్నల్‌ ప్రకారం 1951- 2020 మధ్య భారతదేశంలో మొత్తం 574 ఆకాశ నదులు ఏర్పడ్డాయి. గత రెండు దశాబ్దాల్లో ఏర్పడిన అత్యంత భారీ ఫ్లయింగ్ రివర్లు 80 శాతం వరదలకు కారణమయ్యాయి. 1985- 2020 మధ్య రుతుపవనాల సమయంలో భారత్‌లో వచ్చిన 10 అత్యంత భారీ వరదలకు ఇలాంటి 7 ఫ్లయింగ్ రివర్స్‌కి సంబంధం ఉన్నట్లు స్టడీస్‌లో తేలింది. ఈ మధ్యకాలంలో అయితే..హిందూ మహాసముద్రం నుంచి నీరు ఆవిరిగా మారి.. ఫ్లయింగ్ రివర్లుగా ఏర్పడటం భారీగా పెరిగిపోయింది.

ట్రెండింగ్ వార్తలు