వయనాడ్ తర్వాత ముప్పు ఉన్న ప్రాంతాలు ఇవేనా, ప్రళయం ముంచుకు రానుందా?
ప్రళయం ముంచుకొస్తే విశాఖ కూడా వయనాడ్ కాబోతోందా? చెన్నైకి కూడా ప్రళయం తప్పదా? అందాల సాగరం ముందుకు దూసుకొస్తే పరిస్థితి ఏంటి?
Wayanad Landslide : వయనాడ్ తోనే మొదలు కాలేదు. ఇప్పటితోనే ఇలాంటి ప్రళయాలు ఆగిపోవు. పిక్చర్ అబీ బాకీ హై. ముందుంది ముసళ్ల పండగ. రాబోయే రోజుల్లో వచ్చే ప్రకృతి విలయాల హిట్ లిస్టులో సాగర తీరాలు, ప్రకృతి అందాలు కొలువైన ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. ముంబై నుంచి గుజరాత్ వరకు.. గోవా నుంచి విశాఖ వరకు సముద్ర తీర ప్రాంతంలో చాలా ఏరియాలు డేంజర్ జోన్ లో ఉన్నాయి. ఇప్పుడు అదంతా బాగానే ఉన్నట్లు కనిపిస్తున్నా భవిష్యత్తులో వచ్చే ముప్పు ప్రకృతి ప్రకోపంతో ఏం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది. ప్రళయం ముంచుకొస్తే విశాఖ కూడా వయనాడ్ కాబోతోందా? చెన్నైకి కూడా ప్రళయం తప్పదా? అందాల సాగరం ముందుకు దూసుకొస్తే పరిస్థితి ఏంటి?
యాక్షన్ కు రియాక్షన్ మస్ట్. అది మనిషి అయినా ప్రకృతి అయినా. మనిషి పర్యావరణాన్ని నాశనం చేస్తే.. ప్రకృతి జనం అంతు చూస్తోంది. పగబట్టి మరీ వానలు, వరదలతో విధ్వంసం సృష్టిస్తోంది. చర్యకు ప్రతిచర్య ఉంటుందన్న సూత్రాన్ని ఫాలో అవుతోంది పర్యావరణం. మరోవైపు వాతావరణ మార్పులు కూడా మనిషికి ప్రమాదంగా మారాయి. వయనాడ్ విపత్తుపై ముందే అలర్ట్ చేసిన పర్యావరణవేత్త మాధవ్ గాడ్గిల్ దేశంలో మరిన్ని ప్రాంతాలకు ముప్పు తప్పదని వార్నింగ్ ఇస్తున్నారు. వయనాడ్ తర్వాత క్యూలో ఉన్న ప్రాంతాలు ఏంటి? ఆ ఏరియాలకు ముప్పు వెనుక మర్మం ఏముంది? ప్రళయం ఏ రూపంలో ముంచుకొచ్చే ప్రమాదం ఉంది?
Also Read : వయనాడ్ విపత్తులో పెరుగుతున్న మృతుల సంఖ్య
పూర్తి వివరాలు..