Mobile Numbers : మీ పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో ఇలా తెలుసుకోండి..
మీ పేరు మీద ఎన్ని మొబైల్ నెంబర్లు ఉన్నాయో మీకు తెలుసా? ఒకవేళ ఉంటే అవి పని చేస్తున్నాయో లేదో తెలుసా? మీ పేరు మీదున్న పని చేయని, గుర్తు తెలియని నెంబర్లను బ్లాక్ చేయడం ఎలానో తెలుసా?

Mobile Numbers
Mobile Numbers : మీ పేరు మీద ఎన్ని మొబైల్ నెంబర్లు ఉన్నాయో మీకు తెలుసా? ఒకవేళ ఉంటే అవి పని చేస్తున్నాయో లేదో తెలుసా? మీ పేరు మీదున్న పని చేయని, గుర్తు తెలియని నెంబర్లను బ్లాక్ చేయడం ఎలానో తెలుసా? తెలీదా? కంగారుపడాల్సిన పని లేదు. చాలా ఈజీ. మన పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు తీసుకున్నామో గుర్తించేందుకు ప్రభుత్వ టెలికాం సంస్థ(DoT) ‘TAF-COP’ అనే కొత్త పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది.
స్మార్ట్‌ఫోన్లు మన దైనందిన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారాయి. ముఖ్యంగా మహమ్మారి సమయంలో. కాగా, మోసగాళ్లు చెలరేగిపోతున్నారు. ఇతర వ్యక్తుల ఆధార్ కార్డు వివరాలు సేకరించి సిమ్ కార్డులను కొనుగోలు చేస్తున్నారు. మనకు తెలియకుండానే మన పేరు మీద మొబైల్ నెంబర్ తీసుకుంటున్నారు. నేరాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు టెలికం సంస్థ పోర్టల్ ను తెచ్చింది.
ఆధార్‌కు ఫోన్ నెంబర్ యాడ్ చేయడం తప్పని సరి. ఆధార్ నెంబర్‌కు మొబైల్ నెంబర్ లింక్ చేయడం ద్వారా ఆథెంటికేషన్ సులువు అవుతోంది. కాగా, ఈ విధానం ఫోన్ వినియోగదారులకు కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. మన పేరు మీద ఎన్ని ఫోన్ నెంబర్లు ఉన్నాయి. ఉంటే వాటిలో ఏ నెంబర్ ను ఆధార్ కు యాడ్ చేశామనే విషయాన్ని గుర్తించడం కష్టతరం అవుతుంది.
సైబర్ నేరస్తులు ఆధార్ కార్డ్, ఫోన్ నెంబర్ ద్వారా నేరాలకు పాల్పడుతున్నారు. ఆ నేరాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుండడంతో కేంద్రం వెబ్ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. టెలికాం అనలిటిక్స్ ఫర్ ఫ్రాడ్ మేనేజ్‌మెంట్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ (TAF-COP) అని పిలిచే ఈ పోర్టల్‌లో లాగిన్ అయితే మన ఆధార్ కార్డ్ మీద ఏ ఫోన్ నెంబర్ ను యాడ్ చేశాం. మన పేరు మీద ఎన్ని సిమ్ కార్డ్‌లు ఉన్నాయనే విషయాన్ని ఈజీగా గుర్తించొచ్చు.
* ఈ సైట్ లో మీ ఫోన్ నెంబర్ ను ఎంట్రీ చేస్తే.. మీకు ఓటీపీ వస్తుంది.
* ఆ ఓటీపీని ఎంట్రీ చేస్తే సిమ్ కార్డ్ వివరాలు వెలుగులోకి వస్తాయి.
* ఉపయోగంలో లేనివి, ఇతరులు వాడుతున్న సిమ్ కార్డ్ లను బ్లాక్ చేయవచ్చు.
* సైబర్ నేరస్తుల నుంచి సురక్షితంగా ఉండొచ్చు.
TAFCOP పోర్టల్ ద్వారా యూజర్లు ఎన్ని మొబైల్ నెంబర్లు వారి పేరు మీద రిజిస్టర్ అయ్యాయో తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు. యూజర్లకు తెలియకుండా వినియోగంలో ఉన్న మొబైల్ కనెక్షన్లను నియంత్రించేందుకు ఈ పోర్టల్ ఉపయోగపడుతుందన్నారు. ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారం ఒక వ్యక్తి తన పేరు మీద 9 వరకు మొబైల్ నెంబర్లు కలిగి ఉండొచ్చు.