How To Prevent Covid-19: కరోనా సోకకుండా జాగ్రత్త పడటం ఎలా?

కరోనా మహమ్మారి దేశంలో వేగంగా విస్తరిస్తుంది. కేసుల సంఖ్య దేశ వ్యాప్తంగా మూడు లక్షలకు పైనే నమోదవుతుంది. ఇక కరోనా సోకిన వారిలో చాలామందిలో లక్షణాలు కనిపించడం లేదు. దీంతో వారు సాధారణ వ్యక్తుల్లానే కనిపిస్తున్నారు.. కానీ వైరస్ మాత్రం సోకి ఉంటుంది. 80 శాతం మందిలో ఎటువంటి లక్షణాలు బయటపడటం లేదని వైద్యులు చెబుతన్నారు.

How To Prevent Covi 19

How To Prevent Covid-19: కరోనా మహమ్మారి దేశంలో వేగంగా విస్తరిస్తుంది. కేసుల సంఖ్య దేశ వ్యాప్తంగా మూడు లక్షలకు పైనే నమోదవుతుంది. ఇక కరోనా సోకిన వారిలో చాలామందిలో లక్షణాలు కనిపించడం లేదు. దీంతో వారు సాధారణ వ్యక్తుల్లానే కనిపిస్తున్నారు.. కానీ వైరస్ మాత్రం సోకి ఉంటుంది. 80 శాతం మందిలో ఎటువంటి లక్షణాలు బయటపడటం లేదని వైద్యులు చెబుతన్నారు.

లక్షణాలు లేనివారి వల్లనే ఇప్పుడు ప్రమాదం పొంచి ఉంది. తమకేమి లేదనే ధైర్యంతో వారు బయట తిరిగే అవకాశం ఉంది. ఇలా చేస్తే మరికొంతమందికి అంటించినవారవుతారు. వారం రోజుల వ్యవధిలో మిమ్మల్ని కలిసిన వారిలో ఎవరికైనా కరోనా సోకితే మీరు సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్లిపోవడం మంచిదని వైద్యులు చెబుతున్నారు.

ఇక ఇంట్లో కూడా కుటుంబ సభ్యులతో కలిసి ఉండకుండా వేరే గదిలో ఉండాలని సూచిస్తున్నారు. లక్షణాలు కనిపించకపోయినా కరోనా ఉన్నట్లు అనుమానం వస్తే వెంటనే సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్లడం మంచిదని డాక్టర్లు చెబుతున్నారు. టెస్టుల కోసం అని కాలయాపన చెయ్యకుండా ముందు జాగ్రత్తగా ఐసోలేషన్ లో ఉండాలని కోరుతున్నారు వైద్యులు. సాధారణ జ్వరం, లక్షణాలే కదా అని నిర్లక్ష్యంగా ఉండకూడదు. ప్రత్యేకంగా ఒక గదిలో ఉంటే చాలా మంచిది.

లక్షణాలున్న వ్యక్తితో సహా కుటుంబసభ్యులందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. ప్రతి ఒక్కరూ చేతులు తరచూ శుభ్రం చేసుకుంటుండాలి. ముఖ్యంగా వృద్ధులు, దీర్ఘకాలిక జబ్బులున్న వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. చిన్నపిల్లలను సాధ్యమైనంత దూరంగా ఉంచాలని వైద్యులు సూచిస్తున్నారు. కుటుంబ సభ్యులు కూడా అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల లక్షణాలున్న వ్యక్తికి టెస్టుల అనంతరం పాజిటివ్‌గా నిర్ధారణ అయినా, చాలావరకు మిగతా కుటుంబసభ్యులకు, ఇతరులకు సోకకుండా ఉంటుంది.

శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది. తీవ్ర జ్వరం ఉంటే, ప్రభుత్వ, లేదా ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాలని తెలియచేస్తున్నారు. ప్రస్తుతమున్న వైరస్‌ వేరియంట్ల వ్యాప్తి వేగం గతంలో కంటే 50% నుండి 150 % ఎక్కువగా ఉంది. గాలి, వెలుతురు లేని ప్రాంతాల్లో ఇది మరింత వేగంగా విస్తరిస్తుంది. కాబట్టి ముందుగానే అప్రమత్తం కావడం అనేది చాలా ముఖ్యం. పై జాగ్రత్తలు పాటిస్తే కరోనా వ్యాప్తి చెందకుండా నిరోధించవచ్చు.