Omicron Detection : పంటినొప్పి చికిత్స కోసం వెళ్లిన 12ఏళ్ల బాలికకు ఒమిక్రాన్!

భారత్‌లో ఒమిక్రాన్ వేరియంట్ నెమ్మదిగా వ్యాప్తిస్తోంది. రోజురోజుకీ ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. చాలామందిలో ఒమిక్రాన్ లక్షణాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.

Omicron Detection : భారత్‌లో ఒమిక్రాన్ వేరియంట్ నెమ్మదిగా వ్యాప్తిస్తోంది. రోజురోజుకీ ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. విదేశాల నుంచి వచ్చేవారితో పాటు చాలామందిలో ఒమిక్రాన్ లక్షణాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కొత్త ఒమిక్రాన్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఎయిర్‌పోర్టులో క‌రోనా టెస్టులు చేసినప్పుడు నెగటివ్ వస్తోంది. ఆ తర్వాత చాలామంది పాజిటివ్ నిర్ధారణ అవుతోంది.

లక్షణాలు లేకుండానే ఈ ఒమిక్రాన్ వేరియంట్ చాపకింద నీరులా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తోంది. లక్షణాలు లేనివారు ఇతర అనారోగ్య సమస్యల కోసం ఆస్ప్రతులకు వెళ్లినప్పుడు ఒమిక్రాన్ బయటపడుతుంది. మహారాష్ట్రలో ఒమిక్రాన్ కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. 12ఏళ్ల బాలిక పంటి నొప్పి ట్రీట్‌మెంట్ కోసం ఆస్పత్రికి వెళ్లిన సమయంలో ఒమిక్రాన్ ఉన్న‌ట్లు బయటపడింది. ఒక్క బాలికతో పాటు మరో ఐదుగురు కుటుంబ‌స‌భ్యుల‌కు కూడా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

12ఏళ్ల బాలిక త‌న కుటుంబ‌స‌భ్యుల‌తో క‌లిసి ఇటీవలే నైజీరియా నుంచి మహారాష్ట్ర‌కు తిరిగి వచ్చింది. విదేశాల నుంచి వ‌చ్చినప్పుడు వారిలో ఎవరికి ఎలాంటి క‌రోనా ల‌క్ష‌ణాలు లేవు. దాంతో వారంతా ఇంటికి వెళ్లిపోయారు. కొన్నిరోజులుగా బాలిక‌ పంటినొప్పి సమస్యతో బాధపడుతోంది. పంటికి చికిత్స కోసం స్థానిక డెంట‌ల్ ఆస్పత్రికి వెళ్లింది. కానీ, డెంటిస్ట్ మాత్రం ట్రీట్‌మెంట్ చేసేందుకు నిరాక‌రించాడు. మ‌హారాష్ట్ర‌లో క‌రోనా కేసులు ఉన్నాయనే ఉద్దేశంతో ఆ డాక్టర్ ఆర్టీపీసీఆర్ రిపోర్ట్ తీసుకువస్తేనే ట్రీట్ మెంట్ చేస్తానని సూచించాడు.

దాంతో ఆ బాలిక‌ క‌రోనా టెస్టు చేయించుకోగా ఆమెకు కరోనా పాజిటివ్ వ‌చ్చింది. విదేశాల నుంచి వచ్చారని తెలిసి వారికి జ‌న్యు ప‌రీక్ష‌లు చేయగా.. ఒమిక్రాన్ నిర్ధారించారు. బాలికతో పాటు వారి కుటుంబ‌స‌భ్యుల‌కూ ఒమిక్రాన్ ఉన్నట్టు తేలింది. బాలిక సహా కుటుంబ సభ్యులందరిని జిజామాత ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అక్కడే వారికి ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. వీరిని కలిసిన కాంటాక్టులను ట్రాక్ చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

Read Also : Omicron Cases In India : దేశంలో ఒమిక్రాన్ కలవరం.. 40కి పెరిగిన కేసులు, మహారాష్ట్రలో మరో రెండు

ట్రెండింగ్ వార్తలు