Omicron Cases In India : దేశంలో ఒమిక్రాన్ కలవరం.. 40కి పెరిగిన కేసులు, మహారాష్ట్రలో మరో రెండు

భారత్ లోనూ ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాపిస్తోంది. క్రమంగా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. మహారాష్ట్రంలో తాజాగా మరో రెండు..

Omicron Cases In India : దేశంలో ఒమిక్రాన్ కలవరం.. 40కి పెరిగిన కేసులు, మహారాష్ట్రలో మరో రెండు

Omicron Cases In India

Omicron Cases In India : కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. వేగంగా వ్యాపిస్తూ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. భారత్ లోనూ ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాపిస్తోంది. క్రమంగా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. మహారాష్ట్రంలో తాజాగా మరో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఆ రాష్ట్రంలో ఇప్పటివరక మొత్తం 20మందికి ఈ వేరియంట్ సోకింది. కొత్తగా నమోదైన కేసులతో మన దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 40కి పెరిగింది.

WhatsApp Privacy Update : వాట్సాప్‌లో న్యూ అప్‌డేట్.. ఈ కొత్త ప్రైవసీతో వారికి చెక్ పెట్టొచ్చు..!

మరోవైపు ఒమిక్రాన్.. డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ప్రపంచంలో తొలి ఒమిక్రాన్ మరణం నమోదైంది. బ్రిటన్ లో ఒమిక్రాన్ సోకిన వ్యక్తి మరణించాడు. దీంతో ప్రపంచ దేశాలు అలర్ట్ అయ్యాయి.

ఒమిక్రాన్ నిర్ధారణ అయిన ఓ బాధితుడు మృతి చెందాడని స్వయంగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. కాగా, యూకేలో ఒమిక్రాన్ టైడల్ వేవ్ తప్పదని ఆదివారమే ఆయన హెచ్చరించారు. అందుకే 30 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ కోవిడ్-19 టీకా బూస్టర్ డోస్ వేసుకోవాలని సూచించారు. పశ్చిమ లండన్‌లోని పెడ్డింగ్టన్‌ సమీపంలో ఓ వ్యాక్సినేషన్‌ క్లినిక్‌ని సందర్శించిన సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. దురదృష్టవశాత్తు ఒమిక్రాన్‌ కారణంగా ఆస్పత్రిలో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతోందన్నారు.

కరోనావైరస్ మహమ్మారి వెలుగు చూసి.. దాదాపు 2 ఏళ్లు కావస్తోంది. ఇంకా ప్రపంచాన్ని పట్టి పీడిస్తూనే ఉంది. ఈ రెండేళ్ల కాలంలో అనేక కొత్త వేరియంట్లు ప్రపంచ దేశాలను అతలాకుతలం చేశాయి. కాస్త తగ్గింది.. అని ఊపిరి పీల్చుకునేలోపు కొత్త వేరియంట్ రూపంలో మహమ్మారి మళ్లీ విరుచుకుపడుతోంది. నిన్నమొన్నటి దాకా అత్యంత ప్రమాదకారిగా డెల్టా వేరియంట్‌ వణికించింది. ఇప్పుడు డెల్టా వేరియంట్‌ ను తలదన్నే.. ఒమిక్రాన్‌ అనే మరో వేరియంట్‌ బెంబేలెత్తిస్తోంది. సౌతాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. కరోనా తగ్గుముఖం పట్టి… సాధారణ పరిస్థితులు నెలకొంటున్న తరుణంలో… కొత్త వేరియంట్ భయబ్రాంతులకు గురి చేస్తోంది.

Twitter New Feature : ట్విట్టర్‌లో టిక్‌టాక్‌ లాంటి కొత్త ఫీచర్.. వర్టికల్ వీడియో ఫీడ్..!

ఇదే తరహాలో వ్యాప్తి చెందితే ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతూ మరోసారి కరోనా మహమ్మారి దేశాన్ని అతలాకుతలం చేయడం ఖాయం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వైరస్‌ వ్యాప్తిని చూస్తుంటే థర్డ్‌ వేవ్‌ తప్పదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 57 దేశాలకు ఒమిక్రాన్ వ్యాపించింది.

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఇప్పటికే కలవరపెడున్న డెల్టా వేరియంట్‌ సహా తాజా ఒమిక్రాన్‌ కేసులు భయాందోళన రేకెత్తిస్తున్నాయి. చాపకింద నీరులా విస్తరిస్తున్న కొత్త వేరియంట్‌కు అడ్డుకట్ట వేసేందుకు చాలా వరకు దేశాలు మళ్లీ ఆంక్షల వలయంలోకి వెళ్లిపోతున్నాయి.