Twitter New Feature : ట్విట్టర్‌లో టిక్‌టాక్‌ లాంటి కొత్త ఫీచర్.. వర్టికల్ వీడియో ఫీడ్..!

ప్రపంచవ్యాప్తంగా టిక్ టాక్ ఉన్నంత క్రేజ్ అంతాఇంతాకాదు. ప్రపంచమంతా టిక్ టాక్ వైపే పరుగులు పెట్టింది. ఇప్పుడా టిక్ టాక్ తరహాలో ట్విట్టర్ కూడా కొత్త ఫీచర్ తీసుకొస్తోంది.

Twitter New Feature : ట్విట్టర్‌లో టిక్‌టాక్‌ లాంటి కొత్త ఫీచర్.. వర్టికల్ వీడియో ఫీడ్..!

Twitter Is Planning To Bring Vertical Video Feed

Twitter New Video Feature : ప్రపంచవ్యాప్తంగా టిక్ టాక్ ఉన్నంత క్రేజ్ అంతాఇంతాకాదు. ప్రపంచమంతా టిక్ టాక్ వైపే పరుగులు పెట్టింది. ఇప్పుడా టిక్ టాక్ తరహాలో మైక్రో బ్లాగింగ్ ప్లాట్ ఫారమ్ ట్విట్టర్ కూడా కొత్త ఫీచర్ తీసుకొస్తోంది. టిక్‌టాక్ లాంటి కొత్త ఫీచర్ తీసుకురావాలని భావిస్తోంది. వర్టికల్ వీడియో ఫీడ్ (Vertical Video Feed) అనే కొత్త ఫీచర్ ప్రవేశపెట్టనుంది ట్విట్టర్. Mashable అందించిన సమాచారం ప్రకారం.. Twitter తమ ప్లాట్ ఫాంపై యూజర్ల అనుభవాన్ని మరింత మెరుగుపరించేందుకు edge-to-edge Twitter feed, emoji రియాక్షన్ వంటి వివిధ రకాల కొత్త ఫీచర్లను టెస్టింగ్ చేస్తోంది.

ప్రస్తుతం ట్రెండింగ్ అయ్యే టాపిక్స్, యూజర్లకు ఆసక్తిని కలిగించే వీడియో కంటెంట్ (పర్సనలైజ్డ్) అందించే ఫీచర్ తీసుకురావాలని ట్విట్టర్ భావిస్తోంది. సోషల్ నెట్‌వర్క్ కంపెనీ ట్విట్టర్ సపోర్ట్ ద్వారా Explore Section కోసం టిక్‌టాక్-మోటివేటెడ్ వర్టికల్ వీడియో ఫీడ్‌లో టెస్టింగ్ చేస్తున్నట్టు వెల్లడించింది.

ప్రారంభంలో ఈ కొత్త ఫీచర్ ఇంగ్లీష్ భాషలోనే తీసుకురానుంది. ట్విట్టర్ యాప్‌ను ఉపయోగించే ఆండ్రాయిడ్, iOS యూజర్లకు అందుబాటులోకి రానుంది. ఈ కొత్త ఫీచర్ Explore Section పూర్తిగా మార్చేయనుంది. యూజర్ల కోసం ప్రత్యేకించి ‘Trending’ ‘For You’ సెక్షన్లలలో వర్టికల్ స్ర్కోల్ చేసుకునేలా వీడియో ఫీడ్ అందించనుంది.

మీకు మరింత ఆసక్తిని కలిగించే కొత్త అంశాలను మరింత సులభంగా తెలుసుకునేలా Search Page కూడా టెస్టింగ్ చేస్తున్నట్టు ట్విట్టర్ ఒక ప్రకటనలో పేర్కొంది. క్లబ్‌హౌస్ యాప్ లోని New Spaces ఫీచర్ మాదిరిగా Twitter ఫీచర్‌ను కాపీ చేసి తీసుకొస్తోంది. ట్విట్టర్ ఇలా చేయడం మొదటిసారి కాదు. ఏది ఏమైనప్పటికీ ట్విట్టర్ తీసుకురాబోయే ఈ కొత్త వర్టికల్ వీడియో ఫీడ్ ఫీచర్‌ను యూజర్ల ఆసక్తికి తగినట్టుగా ఎంతవరకు ఆప్టిమైజ్ చేయగలదో చూడాలి.

Read Also : WhatsApp Privacy Update : వాట్సాప్‌లో న్యూ అప్‌డేట్.. ఈ కొత్త ప్రైవసీతో వారికి చెక్ పెట్టొచ్చు..!