Deepfake Video: ప్రధానిని కూడా వదల్లేదు.. తన డీప్‭ఫేక్ వీడియోపై స్వయంగా స్పందించిన మోదీ

ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ ఉపయోగించి డీప్‭ఫేక్ వీడియోలు రూపొందించడంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆందోళన వ్యక్తం చేశారు

Deepfake Video: ప్రధానిని కూడా వదల్లేదు.. తన డీప్‭ఫేక్ వీడియోపై స్వయంగా స్పందించిన మోదీ

PM Modi on Deepfake Video: ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ ఉపయోగించి డీప్‭ఫేక్ వీడియోలు తయారు చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం బ్రిటన్ కు చెందిన ఒక మహిళ వీడియోకు నటి రష్మిక మందన్న డీప్‭ఫేక్ వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అనంతరం కత్రినా కైఫ్ డీప్‭ఫేక్ వీడియో కూడా వచ్చింది. ఇప్పుడు ఈ వరుసలో ప్రధాని మోదీ కూడా చేరిపోయారు. ఆయర గర్బా పాడుతున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అయితే ఇది ఏఐ ద్వారా రూపొందించిన ఫేక్ వీడియో. దీనిపై ప్రధాని స్వయంగా స్పందించారు.

ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ ఉపయోగించి డీప్‭ఫేక్ వీడియోలు రూపొందించడంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం (నవంబర్ 17) ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో దీపావళి సమావేశాల సందర్భంగా జరిగిన మిలన్ కార్యక్రమంలో పాత్రికేయులను ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతూ ఈ సంక్షోభం గురించి మీడియాను, ప్రజలను హెచ్చరించాలని సూచించారు. భారతదేశాన్ని అభివృద్ధి చెందిన భారతదేశంగా మార్చాలని ఆకాంక్షిస్తున్నానని, దానిని మాటల్లో చెప్పడమే కాకుండా చేతల్లో కూడా చూపించాలని కోరుకుంటున్నానని అన్నారు. స్థానికులకు వోకల్ అనే తన పిలుపుకు ప్రజల నుంచి మద్దతు లభించిందని హర్షం వ్యక్తం చేశారు.