IT Raids on Huawei: చైనా ఫోన్ సంస్థ హువావే భారత కార్యాలయాల్లో ఐటీ దాడులు

చైనా ఫోన్ తయారీ సంస్థ హువావేకి చెందిన భారత కార్యాలయాల్లో ఆదాయపు పన్నుశాఖ అధికారులు దాడులు చేపట్టారు.

Huawei

IT Raids on Huawei: చైనా ఫోన్ తయారీ సంస్థ హువావేకి చెందిన భారత కార్యాలయాల్లో ఆదాయపు పన్నుశాఖ అధికారులు దాడులు చేపట్టారు. మంగళవారం కర్ణాటక, ఢిల్లీ, గురుగ్రామ్ (హర్యానా), బెంగళూరులోని హువావే కార్యాలయాల్లో ప్రారంభించిన ఈ దాడులు.. బుధవారం కూడా కొనసాగినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. భారత్ లో పన్ను ఎగవేత దర్యాప్తులో భాగంగా, ఇతర అనధికారిక లావాదేవీలపై వచ్చిన సమాచారం మేరకు ఆదాయపు పన్ను శాఖ ఈ తనిఖీలు నిర్వహించింది. తనిఖీల సందర్భంగా హువావే సంస్థ, భారతీయ కార్యకలాపాలు మరియు విదేశీ లావాదేవీలపై పన్ను ఎగవేసినట్లు అధికారులు గుర్తించారు. అందుకు సంబందించిన కీలక ఆర్థిక పత్రాలు, అకౌంట్స్ పుస్తకాలు మరియు కంపెనీ రికార్డులను పరిశీలించి, కొన్ని రికార్డులను కూడా స్వాధీనం చేసుకున్నట్లు వారు తెలిపారు.

Also read: Free Fire : ఫ్రీ ఫైర్ గేమ్ లవర్స్‌కు షాక్.. ప్లే స్టోర్ నుంచి తొలగింపు

ఐటీ దాడులపై హువావే సంస్థ స్పందించింది. దేశంలో తమ కార్యకలాపాలు చట్టానికి దృఢంగా కట్టుబడి ఉన్నాయని కంపెనీ తెలిపింది.
“ఆదాయపు పన్ను బృందం తమ కార్యాలయంలో తనిఖీలు చేసింది, తనిఖీకి వచ్చిన అధికారులకు తమ సిబ్బంది పూర్తిగా సహకరించారూ” అని సంస్థ ప్రతినిధి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భారత్ లో మా సంస్థ కార్యకలాపాలు అన్ని చట్టాలు మరియు నిబంధనలకు కట్టుబడి ఉన్నాయని తెలిపారు. భవిష్యత్తులోనూ మరింత సమాచారం కోసం సంబంధిత ప్రభుత్వ విభాగాలకు పూర్తిగా సహకరిస్తామని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

Also read: China Loan Apps Scam: నకిలీ పేర్లతో రూ.1400కోట్ల నిధుల తరలింపు

భారత్ లోని టెలికామ్ ఆపరేటర్లు తమ నెట్ వర్క్ లను నిర్వహించడానికి అవసరమైన సాంకేతిక పరికరాలను..చైనా సంస్థలైన జెడ్.టి.ఈ మరియు హువావే సంస్థల నుంచి సేకరించుకునేలా పాత ఒప్పందాల ప్రకారమే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే టెలికమ్యూనికేషన్ సెక్టార్ పై నేషనల్ సెక్యూరిటీ డైరెక్టివ్ ప్రకారం ఏదైనా కొత్త వ్యాపార ఒప్పందంకుదుర్చుకోవడానికి ముందు వారికి ప్రభుత్వం ఆమోదం అవసరం. భారత్ లో కార్యకలాపాలు సాగిస్తున్న షియోమీ మరియు ఒప్పో వంటి చైనా కంపెనీలలో ఆదాయపుశాఖ గత సంవత్సరం నిర్వహించిన తనిఖీల్లో ఆయా సంస్థలలో రూ.6500 కోట్లకు పైగా లెక్కల్లో చూపని ఆదాయాన్ని గుర్తించారు అధికారులు.

ఫిబ్రవరి మూడో వారంలోను 54 చైనా మొబైల్ యాప్స్ ను భారత ప్రభుత్వం నిషేదించింది. భద్రత పరమైన, వినియోగదారుల గోప్యత దృష్ట్యా భారత సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో భారత్ లో యాప్ ఆధారిత “నాన్ బ్యాంకింగ్” ఆర్ధిక సేవలు కొనసాగిస్తున్న లోన్ యాప్ లను నిషేధించి, ఆయా సంస్థల ఆస్తులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడి) స్తంభింపజేసింది.

Also read:Central Government : మరో 54 చైనా యాప్స్‌ను నిషేధించిన కేంద్రం