Central Government : మరో 54 చైనా యాప్స్‌ను నిషేధించిన కేంద్రం

2020నుంచి భారత్‌లో నిషేధించబడిన యాప్‌ల రీబ్రాండెడ్ రీక్రైస్ట్ చేయబడిన యాప్‌లపై నిషేధం విధించింది. భారతీయుల డేటాను చైనా వంటి విదేశాలలోని సర్వర్‌లకు బదిలీ చేస్తున్నట్టు గుర్తించింది.

Central Government : మరో 54 చైనా యాప్స్‌ను నిషేధించిన కేంద్రం

China Apps

Chinese apps banned : చైనా యాప్స్‌పై కేంద్ర ప్రభుత్వం మరోసారి క్కుపాదం మోపింది. తాజాగా మరో 54 చైనా అప్లికేషన్స్‌ను నిషేధించింది. భద్రతా కారణాల దృష్ట్యా చైనా యాప్స్‌ను నిషేధిస్తూ కేంద్ర ఐటీశాఖ నిర్ణయం తీసుకుంది. భారతీయుల గోప్యత, భద్రతకు ముప్పుగా పరిగణిస్తూ 54 కంటే ఎక్కువ చైనీస్ యాప్‌లను నిషేధించాలని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు చేసింది. నిషేధిత అప్లికేషన్స్‌ జాబితాలో టెన్సెంట్, అలీబాబా, గేమింగ్, నెట్ ఈస్ చైనీస్ టెక్నాలజీ సంస్థలు ఉన్నాయి.

2020 నుంచి భారత్‌లో నిషేధించబడిన యాప్‌ల రీబ్రాండెడ్ రీక్రైస్ట్ చేయబడిన యాప్‌లపై నిషేధం విధించింది. భారతీయుల సున్నితమైన డేటాను చైనా వంటి విదేశాలలోని సర్వర్‌లకు బదిలీ చేస్తున్నట్టు గుర్తించింది కేంద్రం. ఈ నేపథ్యంలో తాజాగా అప్లికేషన్లపై నిషేధం విధించింది కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000లోని సెక్షన్ 69 ఏ కింద అప్లికేషన్లపై నిషేధం విధించింది.

Karnataka Schools : కర్ణాటకలో తెరుచుకున్న స్కూల్స్

నిషేధిత అప్లికేషన్‌లను బ్లాక్ చేయాలని గూగుల్ ప్లేస్టోర్‌తో సహా టాప్ యాప్ స్టోర్‌లను కేంద్రం ఆదేశించింది. జూన్ 2020 నుంచి భారత్‌లో 224 చైనీస్ అప్లికేషన్స్‌ను బ్యాన్‌ చేసింది. టిక్ టాక్, షేర్ ఇట్, వియ్ చాట్, హలో, లైకి యుసి న్యూస్, బిగో లైవ్, యుసి బ్రౌజర్, ఈఎస్ ఫైల్స్ వంటి ప్రముఖ అప్లికేషన్‌లను కేంద్రం ఇప్పటికే నిషేధించింది.