Free Fire : ఫ్రీ ఫైర్ గేమ్ లవర్స్‌కు షాక్.. ప్లే స్టోర్ నుంచి తొలగింపు

ఫ్రీ ఫైర్ గేమ్​ లవర్స్​కు గూగుల్ ప్లే స్టోర్​, యాపిల్ యాప్​ స్టోర్లు షాక్ ఇచ్చాయి. తమ ప్లాట్​ఫామ్​ల నుంచి ఫ్రీ ఫైర్​ను తొలగించాయి.

Free Fire : ఫ్రీ ఫైర్ గేమ్ లవర్స్‌కు షాక్.. ప్లే స్టోర్ నుంచి తొలగింపు

Garena Free Fire

Free Fire : దేశంలో అత్యధిక మంది ఆడే మొబైల్ గేమ్స్ లో ఒకటి గరీనా ఫ్రీ ఫైర్​. ఒకప్పుడు పబ్​జీకి గట్టి పోటీ ఇచ్చిన ఈ గేమ్​.. పబ్​ జీ బ్యాన్​తో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. అయితే ఫ్రీ ఫైర్ గేమ్​ లవర్స్​కు గూగుల్ ప్లే స్టోర్​, యాపిల్ యాప్​ స్టోర్లు షాక్ ఇచ్చాయి. తమ ప్లాట్​ఫామ్​ల నుంచి ఫ్రీ ఫైర్​ను తొలగించాయి. ఇందుకు కారణం ఏమిటి అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఇటు ఫ్రీ ఫైర్ నిర్వాహకులు గరీనా కూడా దీనిపై స్పందించలేదు.

WhatsApp Web : వాట్సాప్ వెబ్‌లోనూ ఇక వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు.. కమింగ్ సూన్..!

బ్యాటిల్​ గ్రాండ్ మొబైల్ ఇండియా (బీజీఎంఐ) మాతృ సంస్థ క్రాఫ్టన్​ వల్లే ప్రీ ఫైర్ గూగుల్ ప్లే స్టోర్​, యాపిల్ యాప్ స్టోర్​ నుంచి తొలగించి ఉండొచ్చని తెలుస్తోంది. గరీనా తమ గేమ్​ థీమ్​ను కాపీ కొట్టినట్లు పబ్ జీని రూపొందించిన క్రాఫ్టన్ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఈ విషయమై క్రాఫ్టన్.. న్యాయస్థానాన్ని కూడా సంప్రదించింది. గరీనా సంస్థతో పాటు.. కాపీ కొట్టిన గేమ్​ను ఆయా ప్లాట్​ఫామ్​లపై డౌన్​లోడ్​కు వీలు కల్పిస్తున్నందుకు.. గూగుల్​, యాపిల్ సంస్థలపైనా క్రాఫ్టన్​ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో ఆ గేమ్ ను గూగుల్, యాపిల్ తమ ప్లాట్ ఫామ్స్ నుంచి తొలగించినట్లు చెబుతున్నారు. అయితే ఈ వివాదంపై ఇంతవరకు ఇరు వర్గాల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

Sleep : అతిగా నిద్రపోతున్నారా!…అయితే జాగ్రత్త?

అదే సమయంలో.. ఈ గేమ్ ను కూడా ఇండియాలో బ్యాన్ చేసి ఉంటారని సోషల్ మీడియాలో డిస్కషన్ జరుగుతోంది. అయితే, ఇప్పటికే గేమ్ ను డౌన్ లోడ్ చేసుకున్న వారికి ఎలాంటి ఇబ్బంది లేదు.

గరేనా ఫ్రీ ఫైర్ గేమ్.. దేశంలో ఎంతో పాపులర్ అయింది. రోజూ కోట్లాది మంది ఈ బ్యాటిల్ రాయల్ గేమ్‌ ఆడుతున్నారు. 50 మంది ప్లేయర్లు.. 10 నిమిషాల పాటు జరిగే రౌండ్‌లో విజయం కోసం పోటీపడతారు.

కాగా, ఈ గేమ్.. యువత ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది. కొందరు యువకులు.. అదే పనిగా ‘ఫ్రీ ఫైర్‌ గేమ్‌’ ఆడుతూ చివరికి, మానసికస్థితి కోల్పోయి పిచ్చోళ్లుగా మారుతున్నారు. స్మార్ట్ ఫోన్ లో ‘ఫ్రీ ఫైర్‌ గేమ్‌’ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకుని గంటల తరబడి ఆడుతున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆ గేమ్ కి బానిసగా మారుతున్నారు. తిండి, నిద్ర కూడా మర్చిపోతున్నారు. వారాలు, నెలలు తరబడి గేమ్ ఆడుతున్నారు. ఎవర్నీ పట్టించుకోకుండా ఒక్కరే గట్టిగా అరుస్తూ మొబైల్ గేమ్‌కు బానిసగా మారుతున్నారు.

కొందరు యువకులు.. కనీసం ఆహారం తినలేదు.. కంటి నిండా నిద్రపోలేదు. ఇలా నెలలు తరబడి గేమ్ ఆడటంతో వారి ఆరోగ్య పరిస్థితిపై తీవ్రమైన ప్రభావం చూపింది. మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయి పిచ్చోళ్లుగా మారుతున్నారు. ఈ క్రమంలో మన దేశంలో ఫ్రీ ఫైర్ గేమ్ ను బ్యాన్ చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.