WhatsApp Web : వాట్సాప్ వెబ్‌లోనూ ఇక వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు.. కమింగ్ సూన్..!

ఈ వాయిస్ కాలింగ్ ఫీచర్ ద్వారా వాట్సాప్ వెబ్ యూజర్లు తమ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు ఈజీగా వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు.

WhatsApp Web : వాట్సాప్ వెబ్‌లోనూ ఇక వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు.. కమింగ్ సూన్..!

Whatsapp Web Rolling Out Vo

WhatsApp Web Voice Call Feature : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వెబ్ వెర్షన్ యూజర్లకు గుడ్ న్యూస్.. అతి త్వరలో వాట్సాప్ వెబ్‌లోనూ కాలింగ్ ఫీచర్ రానుంది. ఈ వాయిస్ కాలింగ్ ఫీచర్ ద్వారా వాట్సాప్ వెబ్ యూజర్లు తమ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు ఈజీగా వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. అయితే ఈ వాయిస్ కాలింగ్ ఫీచర్ వాట్సాప్ వెబ్ యూజర్ల అందరికి అందుబాటులో ఉండదు. ఎంపిక చేసిన కొంతమంది వాట్సాప్ యూజర్లకు మాత్రమే ఈ సరికొత్త ఫీచర్ అందుబాటులోకి వస్తోంది.

అక్టోబర్ 2020లోనే మెసేజింగ్ యాప్.. WhatsApp Web, డెస్క్‌టాప్ యూజర్ల కోసం వీడియో, వాయిస్ కాలింగ్ ఫీచర్‌ను అందుబాటులో తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఈ ఫీచర్ బీటా టెస్టర్‌లతో పాటు కొన్ని నాన్-బీటా టెస్టర్‌లకు కూడా అందుబాటులోకి వచ్చింది. వాట్సాప్ త్వరలో ఎక్కువ మంది యూజర్లకు ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది.

ప్రముఖ టిప్‌స్టర్ ముకుల్ శర్మ వాట్సాప్ వెబ్ వాయిస్ కాలింగ్ ఫీచర్ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేశారు. శర్మ షేర్ చేసిన ఆ స్క్రీన్‌షాట్‌లో.. చాట్ విండో (Chat Window) పైభాగాన ఉన్న సెర్చ్ ఐకాన్ పక్కన వీడియో, వాయిస్ కాల్ ఐకాన్ కనిపిస్తుంది. బీటా యూజర్లు ఈ ఫీచర్‌ యాక్సెస్‌ చేసుకోవచ్చు. బీటాయేతర వాట్సాప్ యూజర్లకు కూడా ఈ కొత్త ఫీచర్ త్వరలో అందుబాటులోకి రావచ్చని తెలిపింది.

WhatsApp వాయిస్ కాల్స్ కోసం కొత్త ఇంటర్‌ఫేస్‌ను రిలీజ్ చేయడం కంపెనీ ప్రారంభించింది. ఆండ్రాయిడ్ బీటా (Android Beta) యాప్‌లో కొత్త ఇంటర్‌ఫేస్ అప్‌డేట్ కొద్దిమంది బీటా టెస్టర్‌లకు మాత్రమే అందుబాటులో ఉంది. రాబోయే రోజుల్లో మిగిలిన వాట్సాప్ టెస్టర్లకు కూడా అందుబాటులోకి రానుంది.

వాట్సాప్ పర్సనల్ కాలర్ ఇంటర్‌ఫేస్‌ను రీస్టోర్ చేయడం లేదు.. త్వరలో యూజర్ల గ్రూప్ కాల్‌ల కోసం పూర్తిగా కొత్త డిజైన్‌ను చూస్తారని Wabetainfo నివేదిక పేర్కొంది. మీరు గ్రూప్ వాయిస్ కాల్ చేసినప్పుడు.. కాల్ సమయంలో జాయిన్ వారందరికి వాయిస్ వేవ్‌ఫారమ్‌ (voice waveforms)లను కనిపిస్తాయని స్క్రీన్‌షాట్‌ ద్వారా తెలుస్తోంది. ఆండ్రాయిడ్ బీటా టెస్టర్‌లకు కొత్త అప్‌డేట్ కొద్ది రోజుల్లో అందుబాటులోకి వస్తోందని Wabetainfor నివేదించింది.

రాబోయే వారాల్లో మరిన్ని అప్ డేట్స్ అందుబాటులోకి రానుంది. ప్రస్తుతానికి, iOS బీటా యాప్‌లో కొత్త ఇంటర్‌ఫేస్ కనిపించడం లేదు. ఫ్యూచర్ అప్‌డేట్‌లో WhatsAppకి కూడా అందుబాటులోకి రావచ్చని ఫీచర్స్ ట్రాకర్ చెబుతోంది. వాయిస్ కాల్‌ల కోసం ఇంటర్‌ఫేస్‌ను ఇంప్రూవ్ చేసే ఫీచర్ ఇప్పటికే బీటాలో ప్రారంభమైంది. వాయిస్ కాల్‌ల కోసం వాల్‌పేపర్‌ సామర్థ్యం కూడా ఈ బీటా అప్‌డేట్‌లో అందుబాటులో ఉందని నివేదిక పేర్కొంది.

Read Also : Potato Milk : మార్కెట్ లోకి ‘ఆలూ పాలు’..వేగన్స్ కూడా తాగొచ్చు..