Potato Milk : మార్కెట్ లోకి ‘ఆలూ పాలు’..వేగన్స్ కూడా తాగొచ్చు..

మార్కెట్ లోకి ‘ఆలూ పాలు’వచ్చాయి. అంటే బంగాళాదుంపల పాలు.గేదెపాలు,ఆవు పాలు,మేకపాలు,గాడిదపాలు, ఆఖరికి ఒంటె పాలు గురించి కూడా తెలుసు. కానీ..మరి మీకు ‘‘ఆలూ పాలు‘ గురించి తెలుసా?వాటితో..

Potato Milk : మార్కెట్ లోకి ‘ఆలూ పాలు’..వేగన్స్ కూడా తాగొచ్చు..

Potato Milk Trending Swedish Company Develops

Potato Milk Trending Swedish Company Develops : పొద్దున్న లేవగానే ఓ కప్పు కాఫీనో..లేదా టీ గొంతులో పడాల్సిందే. కాఫీ,టీ తాగాలంటే ఏం పాలుతో పెడతారు? మీరు ఏ పాలు వాడతారు? అంటే గేదె పాలు అనో లేదా ఆవు పాలు అనో తెలియకపోతే..ఏంనండీ..మేం ప్యాకెట్ పాలే వాడతాం అని చెబుతారు. కానీ గేదెపాలు,ఆవు పాల గురించి అందరికీ తెలుసు. మేకపాలు,గాడిదపాలు, ఆఖరికి ఒంటె పాలు గురించి కూడా తెలుసు. కానీ..మరి మీకు ‘‘ఆలూ పాలు‘‘ గురించి తెలుసా? అంటే ఏంటీ ఆలూ పాలా? అంటే బంగాళాదుంపల పాలా? ఇదేందమ్మో మేమెప్పుడు వినలా? ఆలూతో వేపుడు, కూర, కుర్మావంటివి చేసుకుంటాంగానీ ఆలూ పాలేంటీ? విచిత్రంగా అని తెగ ఆశ్చర్యపోతాం. కానీ ఇప్పుడు మార్కెట్ లో ‘ఆలూ పాలు’ అమ్ముతున్నారు..!!

Also read : World Vegan Day: వరల్డ్‌ వేగన్‌ డే..ఈ పదం ఎలా వచ్చింది? ‘వేగనిజం’ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు

గేదెపాలు, ఆవుపాలే కాదు ఇంకా చాలా జంతువుల పాల గురించి అందరికీ తెలుసు..అలాగే కొబ్బరిపాలు గురించి కూడా తెలుసు ఆఖరికి సోయా మిల్క్, ఆల్మండ్‌ మిల్క్, ఓట్‌ మిల్క్‌ గురించి చాలామందికి తెలుసు. కానీ ‘‘ఆలూ మిల్క్‌’’ కూడా మార్కెట్లోకి వచ్చేసాయి. ప్రపంచంలోనే వాణిజ్య పద్ధతిలో ఆలుగడ్డల నుంచి పాలను తయారు చేసే ఏకైక స్వీడన్‌ కంపెనీ అయిన ‘డగ్‌’ ఈ ‘ఆలు పాల‘ ను తాజాగా యూకేలో ప్రవేశపెట్టింది. జంతువుల నుంచి సేకరించే పాలలాగానే ఆలూ పాలు కూడా చిక్కగా, రుచికరంగా ఉంటాయని చెబుతోంది సదరు కంపెనీ.

Also read : ఒంటె పాలు లీటర్ రూ.600, కారణం ఏంటో తెలిస్తే మీరూ కొంటారేమో

ఈ పాలతో మనం కాఫీ లాగానే లాట్టెస్, కాపిచీనో కూడా తయారు చేసుకోవచ్చని..ఆలు పాలతో తయారు చేసిన కాపిచీనో చాలా టేస్టీగా ఉంటుందని చెబుతున్నారు. ఈ ఆలు పాలను త్వరలోనే ఇతర యూరోపియన్‌ దేశాలతోపాటు చైనాలో ఆలూ పాలను ప్రవేశపెట్టే యోచనలో ఉంది ‘డగ్‌’ సంస్థ.

ఆలు పాలకు పెరుగుతున్న క్రేజ్..కొనటానికి ఎగబడుతున్న యూకే వాసులు..
మాల్టోడెక్స్‌ట్రిన్, పీ ప్రొటీన్, చికోరీ ఫైబర్, ర్యాప్‌సీడ్‌ ఆయిల్, ఫ్రక్టోస్, సూక్రోస్‌ సహా వివిధ విటమిన్లతో కూడిన ఆలూ పాలను కొనేందుకు ప్రస్తుతం యూకేవాసులు పోటీపడుతున్నారట. ఇది వెగాన్‌ ఫ్రెండ్లీ (అంటే జంతురహిత ఉత్పత్తి) కావడంతో వీగన్లు కూడా ఈ ఆలూ పాలు కొంటున్నారట. జంతువులు ఇచ్చే పాలలో ఉండే లాక్టోస్‌ (ఒక రకమైన చక్కెర) కొందరికి అజీర్తి చేస్తుంది. జీర్ణం కాదు. కానీ ‘డగ్‌’ తయారు చేసే ఆలూ పాలు లాక్టోస్‌రహితమైనవట. అందుకే చాలామంది ఆలు పాలు తెగ కొంటున్నారట. పైగా దీని ధర ఆల్మండ్‌ మిల్క్, సోయా మిల్క్‌ల కంటే తక్కువ ధర కావటంతో ఆలు పాలకు మంచి డిమాండ్ వస్తోందంటున్నారు. ఆలు పాలు లీటరుకు సుమారు రూ. 170కి అమ్ముతున్నారు. కాబట్టి ఆల్మండ్, సోయా పాలకంటే తక్కువ ధరే అంటున్నారు వినియోగదారులు.

టేస్ట్ గురించి వినియోగదారుల స్పందన ఇలా..
కానీ మిగతాపాల కంటే ఈ ఆలు పాలు టేస్ట్ పెద్దగా లేదంటున్నారు. మరికొందరు ఆలు పాలు కాస్త ‘ఉప్ప’గా ఉన్నాయంటున్నారు. సోయా మిల్క్‌లో ఉండే 8 గ్రాముల ప్రొటీన్, ఓట్‌ మిల్క్‌లో ఉండే 3 గ్రాముల ప్రొటీన్‌లతో పోలిస్తే ఆలూ మిల్క్‌లో కేవలం ఒక గ్రాము ప్రొటీన్‌ మాత్రమే ఉందంటున్నా ఇంకొందరు. అయితే సోయా పాలలో లభించే ప్రొటీన్లకన్నా నాలుగురెట్లు ఎక్కువ ప్రొటీన్లు ఆలూ పాలలో ఉన్నాయని చెబుతోంది సదరు కంపెనీ.

Also read :  Goat Milk Demand : లీటరు మేక పాలు రూ.1500..ఓ రేంజ్ లో పెరిగిన ధర..ఎందుకంటే

ఆలూనే పాల ఐడియా ఎలా? ఎందుకు?
సోయా, ఓట్‌ మిల్క్‌ కంటే..ఆలుగడ్డను తక్కువ విస్తీర్ణంలోనే ఎక్కువగా సాగు చేసేందుకు అవకాశం ఉండటం ఓ కారణంగా చెప్పుకోవచ్చు. అలాగే వ్యాపార స్థాయిలో ఉత్పత్తి చేసేందుకు వీలుండటంతో ఆలూ నుంచి పాల తయారీని చక్కటి లాభదాయక వ్యాపారంగా చేసుకున్నామని ‘డగ్‌’ సంస్థ ప్రతినిదులు చెబుతున్నారు. అలాగే తక్కువ నీటి వాడకంతోనే ఆలూ పంట చేతికొచ్చే అవకాశం ఉండటం కూడా ఇందుకు మరో కారణమని కంపెనీ తెలిపింది. అన్నింటికీ మించి ఇతర పాలతో పోలిస్తే కారుచౌకగా ‘ముడిసరుకు’ లభిస్తుందని పేర్కొంది.

కాగా..మనం ఆలు పొట్టు చెక్కుతున్నా..దానికి కట్ చేస్తున్నా తెల్లగా పాలులాంటివి వస్తుంటాయి. కానీ మనం వాటిని పెద్దగా పట్టించుకోం.కానీ ఇప్పుడు ఆ ఆలు పాలే మార్కెట్ లో హల్ చల్ చేస్తున్నాయి.