World Vegan Day: వరల్డ్‌ వేగన్‌ డే..ఈ పదం ఎలా వచ్చింది? ‘వేగనిజం’ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు

నవంబర్ 1. వరల్డ్‌ వేగన్‌ డే. ఏంటీ వేగన్ డే. ఎలా వచ్చిందీ పదం? అసలేంటీ వేగన్ డే. వాళ్లెవరు? అనే పలు ఆసక్తికర విషయాలను ఈ వేగన్ డే సందర్భంగా ఎన్నో విషయాలు మీ కోసం..

World Vegan Day: వరల్డ్‌ వేగన్‌ డే..ఈ పదం ఎలా వచ్చింది? ‘వేగనిజం’ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు

World Vegan Day 2021

World Vegan Day 2021 : నవంబర్ 1. వరల్డ్‌ వేగన్‌ డే. ఏంటీ వేగన్ డే. ఎలా వచ్చిందీ పదం? అసలేంటీ వేగన్ డే. వాళ్లెవరు? అనే పలు ఆసక్తికర విషయాలను ఈ వేగన్ డే సందర్భంగా తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా చాలామంది వేగన్స్‌గా మారిపోతున్నారు. నేడు (సోమవారం) వరల్డ్‌ వేగన్‌ డే సందర్భంగా ‘వేగనిజం’ గురించి పలు ఆసక్తికర విషయాలు ఈ వేగన్ డే సందర్భంగా తెలుసుకుందాం. ఫస్ట్ ‘వేగన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ‘వేగన్స్’అంటే మాంసాహారం మాత్రమే మానేసినవాళ్లు శాకాహారులు. కనీసం వారు పాలు గానీ,పెరుగు,వెన్న, నెయ్యి ఇలా పాల పదార్ధాలు కూడా తినరు. వారినే వేగన్స్ అంటాం.

వేగన్స్‌ అంటే?
మాంసాహారం మాత్రమే కాదు..జంతువుల నుంచి వచ్చే పాలు, పెరుగువంటి ఉత్పత్తులను కూడా తినరు. తీసుకోకుండా, కేవలం మొక్కలు, ఆకుల మీద ఆధారపడి బతికేవారినే వేగన్స్ అంటారు. మరి ఈ వేగన్ అనే పదం ఎలా వచ్చింది? ఎవరు ఈ పదాన్ని సృష్టించారు? అంటే..ఈ వేగన్ పదాన్ని సృష్టించినవాడు జంతు హక్కుల న్యాయవాది డోనాల్డ్‌ వాట్సన్‌. వెజిటేరియన్‌ అనే పదం నుంచి డొనాల్డ్ ఈ ‘వేగన్‌’ అనే పదాన్ని సృష్టించాడు. అలా డొనాల్డ్ 1944లో ‘ది వేగన్‌ సొసైటీ’ని స్థాపించాడు. ఆ వేగన్‌ సొసైటీ 50వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 1994 నుంచి ప్రతి ఏటా నవంబర్‌ 1న వరల్డ్‌ వేగన్‌ డే నిర్వహిస్తున్నారు. నవంబర్‌ నెలను వేగన్‌ మంత్‌గా సెలబ్రేట్‌ చేస్తున్నారు.

Read more : World Environment Day 2021: ప్రకృతి కోసం.. ఈ ఏడాది “RRR” థీమ్‌తో పర్యావరణ దినోత్సవం

వేగన్స్ కు పోషకాల మాటేంటీ?
వేగన్‌గా మారాలంటే మాంసాహారాన్ని మర్చిపోవాలి. అంతేకాదు పాలు పాల పదార్ధాలు కూడా తీసుకోరువారు. మరి ఇన్ని మానేస్తే మరి శరీరానాకి పోషకాలు ఎలా అందుతాయి? అనే పెద్ద డౌటనుమానం రానే వస్తుంది? శరీరానికి పోషకాలు అందాలంటే..ఎలా వేగన్స్ ఏం తింటారు? అంటే..వారేం చెబుతారో తెలుసా? శరీరానికి అత్యవసరమైన అమినో యాసిడ్స్‌ అన్నీ ఆకుకూరలు, కూరగాయల్లో దొరుకుతాయంటారు వేగన్స్‌.

మాంసాహారం, పాలు, పాల ఉత్పత్తులకు దూరంగా ఉన్నా..టోఫు, బాదం పాలు, సోయాపాలు, కొబ్బరిపాలు, బియ్యంపాలు వంటివాటిని ప్రత్యామ్నాయంగా తీసుకోవచ్చంటున్నారు. ఛీజ్, మయోనీజ్‌ సైతం… పాలు, గుడ్లు లేకుండా తయారు చేసుకోవచ్చంటారు.

ప్రత్యామ్నాయంగా శాకాహార మాంసం..
ముక్కలేనిదే ముద్దదిగని వాళ్లు కొంతమంది చాలామందే ఉన్నారు. ఎంత వద్దనుకున్నా ఏదో ఒకరకంగా మాంసాహారం ఊరిస్తూనే ఉంటుంది. టెమ్ట్ చేసేస్తుంది ఘుమగుమల వాసనలతో. రాతై మాంసాహారం తినాలంటే ఎక్కుసేపు నమలాలి. మాంసాహారం పంటికి సరిపోయే బైట్‌ స్ట్రెంత్‌ కలిగి ఉంటుంది. శాకాహారంతో అలా ఉండదు. చాలామంది నాన్‌వెజ్‌ వదలకపోవడానికి కారణం కూడా ఇదే అని చెప్పొచ్చు.

కానీ… ఇలాంటివారికోసం మొక్కల నుంచి ప్రత్యామ్నాయం దొరుకుతుందంటున్నారు వేగన్స్. అదే వెజ్‌ మీట్‌. మాంసం టెక్చర్‌తోపాటు… పంటికి మాంసం తిన్న ఫీలింగ్‌ని ఇస్తుందిది. మొక్కల నుంచి వచ్చే మాంసందే ప్యూచర్ అంతా అంటున్నారు నిపుణులు. ఇటువంటి వ్యాపారాల్లో ప్రముఖులున్నారు. నటి జెనీలియా బిజినెస్ ఇదే. వీటితో సీక్‌ కబాబ్, చికెన్‌ నగ్గెట్, బిర్యానీ, బర్గర్‌పాటీస్, సాసేజెస్‌ వంటివి చేసుకోవచ్చట.

Read more : Microfiber‌s Effect : జీన్స్‌ ప్యాంట్స్‌ని 30రోజులకు ఒకసారే ఉతకాలట..లేదంటే ప్రమాదం తప్పదంటున్న నిపుణులు

వేగన్స్‌గా మారితే లాభాలు మెండు..
వేగన్స్‌గా మారితే మనం పర్యావరణానికి చాలా మేలు చేసినవారం అవుతాం.జంతువులను రక్షించొచ్చు. అంతేకాదు పర్యావరణాన్ని పరిరక్షించినవాళ్ల మవుతామవుతాం. వేగన్‌గా మారడం వల్ల 15 రకాల ప్రాణహానికలిగించే వ్యాధులకు దూరంగా ఉండొచ్చని చెబుతున్నారు నిపుణులు. వేగన్స్ తినే ఆహారంలో కొలెస్ట్రాల్‌ తక్కువ, ఫైబర్‌ ఎక్కువగా ఉంటుంది. దీంతో గుండె జబ్బులు, టైప్‌ టు డయాబెటిస్, క్యాన్సర్స్, ఆర్థ్రరైటిస్, ఊపిరితిత్తులు, కిడ్నీ వ్యాధులేవీ దరిదాపులకు కూడా రావంటున్నారు. అంతేకాదు శారీరక మానసిక ఆరోగ్యానికి కేరాఫ్ అడ్రస్ గా ఉంటారు వేగన్స్, బరువు పెరగరు. అంతేకాదు మానసిక ఆరోగ్యంగా ఉంటారు.

ప్రపంచ జనాభాలో 5శాతం శాఖాహారులుండగా..వారిలో సగంమంది వేగన్స్‌గా ఉన్నారు.నో మీట్‌ పాలసీలో భాగంగా 2012 నుంచి ప్రతి సోమవారం నాడు లాస్‌ ఏంజిల్స్‌లో మాంసాహారం అమ్మరు. కాగామీట్ బర్గర్ అంటే ఇష్టపడేవారికి చక్కటి ఫుడ్ అందించాలనే ఉద్ధేశ్యంతో 2020లో కేఎఫ్‌సీ మొట్టమొదటి వేగన్‌ బర్గర్‌ను తయారు చేసిన విషయం తెలిసిందే.

వేగన్ సెలబ్రిటీస్‌
బాలీవుడ్‌ స్టార్స్‌ అమిర్‌ఖాన్, జెనీలియా, రితేష్‌ దేశ్‌ముఖ్, సోనమ్‌ కపూర్, అనుష్క శర్మ, శ్రద్ధా కపూర్, కంగనా రనౌత్, వంటి మాంసాహారం ముట్టబోమని ఒట్టు పెట్టుకున్నారు. అలాగే క్రికెట్ అంటే ఠక్కున గుర్తుకొచ్చే విరాట్ కోహ్లీ కూడా వీగనే.