Microfiber‌s Effect : జీన్స్‌ ప్యాంట్స్‌ని 30రోజులకు ఒకసారే ఉతకాలట..లేదంటే ప్రమాదం తప్పదంటున్న నిపుణులు

జీన్స్‌ ప్యాంట్స్‌ని 30రోజులకు ఒకసారే ఉతకాలట..లేదంటే ప్రమాదం తప్పదంటున్న నిపుణులు. ఎవరికి ప్రమాదం? ఎందుకు ప్రమాదం? అనే విషయం అందరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

Microfiber‌s Effect : జీన్స్‌ ప్యాంట్స్‌ని 30రోజులకు ఒకసారే ఉతకాలట..లేదంటే ప్రమాదం తప్పదంటున్న నిపుణులు

Jeans Pants Washing Machine

Overuse of Washing Machine is Harmful for Environment : ఒకప్పుడు రోట్లో కష్టపడి రుబ్బుకునే పచ్చడి ఇప్పుడు మిక్సీలో వేసి గిర్రుమని రెండు తిప్పులు తిప్పితే చాలు ప్లేట్లోకొచ్చి పడుతోంది. రోట్లో రుబ్బిన పచ్చడి టేస్టే వేరు మరి. కానీ ఇప్పుడంత తీరకా లేదు..ఓపికా లేదు. ఒకప్పడు బండమీద దబాదబా ఉతుక్కునేవాళ్లం బట్టల్ని.కానీ ఇప్పుడో వాషింగ్ మిషన్ లో వేసి..టైమ్ సెట్ చేస్తే చాలు ఉతికిన బట్టలు రెడీ అయిపోతున్నాయి. ఇలాంటి మిషన్ల వాడకం వచ్చాక మనిషికి కాస్త అనారోగ్య సమస్యలు వచ్చాయనే చెప్పాలి. ఎందుకంటే శరీరానికి ఏమాత్రం కష్టంలేకుండా పనులు జరిగిపోతున్నాయి.

కూరగాయల్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకునే అలవాటు లేదు ఒకప్పుడు కానీ ఇప్పుడలా కాదు. ఇలా మార్కెట్ నుంచి (మార్కెట్స్ లో కూడా అవి ఫ్రిడ్జ్ లో ఉన్నట్లే) ఇలా ఫ్రిడ్జ్ లో సర్దేసుకోవటం. కానీ ఈ మిషన్ల వాడకంతో మనకు సుఖంగా సమయానికి పనులు జరిగిపోతున్నాయి. కానీ మిషన్ల వాడకంతో పర్యావరణానికి పెను ముప్పు ఏర్పడుతోందనే విషయం మీకు తెలుసా?అంటే అంత తీరకలేదమ్మా ఇవన్నీ తెలుసుకోవటానికి అని దీర్ఘాలు తీస్తాం. కానీ పర్యావరణానికి ముప్పు అంటే మనకే ముప్పు అనే విషయం అయినా గుర్తించాలి. లేదంటే బలయ్యేది మనమే. అంటే మనుషులమే.

Read more : World Environment Day : జీవన విధానాలు మార్చుకుందాం..పర్యావరణాన్ని కాపాడుకుందాం

మన సౌకర్యం కోసం వాడుతున్న ఫ్రిజ్‌ల వల్ల ఓజోన్‌ పొరకు చాలా నష్టం వాటిల్లుతుందని ఇప్పటికే శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇప్పుడు తాజాగా ఈ కోవలోకి మరోకటి వచ్చి చేరింది. అది వాషింగ్‌ మెషీన్‌. మనల్ని బట్టలుతికే శ్రమ నుంచి తప్పించిన వాషింగ్‌ మెషీన్‌ను తరచుగా వాడటం వల్ల పర్యావరణం మీద పెను ప్రభావం పడుతోందంటున్నారు నిపుణులు. భూమిని పరిరక్షించుకోవాలని భావిస్తే.. వాషింగ్‌ మెషిన్‌ వాడకాన్ని తగ్గించమని సూచిస్తున్నారు. కోరుతున్నారు. మరి వాషింగ్ మిషన్ వాడకానికి పర్యావరణ నష్టానికి గల సంబంధమేంటో తెలుసుకుందాం..

ప్రతి రోజు వాషింగ్‌ మెషీన్‌ను వాడుతున్నారని.. దీనివల్ల పర్యావరణం మీద చాలా ప్రతికూల ప్రభావం ఉంటుందని సోసైటీ ఆఫ్‌ కెమికల్‌ ఇండస్ట్రీ వెల్లడించింది. వాషింగ్ మెషీన్‌లో బట్టలు ఉతికే ప్రతిసారి, మిలియన్ల మైక్రోఫైబర్‌లు నీటిలోకి విడుదల అయ్యి అవి పర్యావరణానికి తీవ్ర నష్టాన్ని కలుగజేస్తాయని తెలిపారు. మైక్రో ఫైబర్‌లు ప్లాస్టిక్ చిన్న తంతువులు. ఇవి పాలిస్టర్, రేయాన్, నైలాన్ వంటి సింథటిక్ ఫ్యాబ్రిక్‌ల నుంచి బయటకు వెలువడతాయి. అవి మహాసముద్రాలలో ప్లాస్టిక్ కాలుష్యానికి కారణమవుతున్నాయని సైంటిస్టులు భావిస్తున్నారు.

Read more : World Environment Day: మీకిది తెలుసా.. పీపీఈ కిట్ భూమిలో కలవాలంటే 500 ఏళ్ళు!

ఇటువంటి ప్రమాదాలను నివారించాలంటే మనం వాషింగ్ మిషన్ ని ప్రతీరోజు వాడటం మానివేయాలి. కానీ అలాకుదరదుగా. రోజు మాసిన బట్టల్ని మరి అలాగే వేసుకోలేంకదా. అలా వాటిని ఉతకాలి అంటే వాటిని వాషింగ్ మిషన్ లో వేయాల్సిందే.కానీ అలా వేస్తే పర్యారణానికి నష్టం. మరి ఏం చేయాలి? విడిచినవే మళ్లీ వేసుకోవాలా? అంటే అలాకాదు..దీనికో ప్రత్యామ్నాయం ఉందంటున్నారు నిపుణులు.నెలకు ఒక్కసారి మాత్రమే వాషింగ్‌ మెషీన్‌ వాడమని నిపుణులు ఈ నివేదికలో సూచించారు. అంటే జీన్స్‌ ప్యాంట్స్‌ని నెలకు ఒకసారి.. జంపర్స్‌ని పదిహేను రోజులకు ఒకసారి.. పైజామాలను వారానికొకసారి ఉతకాలని సూచించారు. అలాగే టీ షర్ట్స్‌, టాప్స్‌ వంటి వాటిని ఐదు సార్లు.. డ్రెస్‌లను ఆరు సార్లు ధరించిన తర్వాత ఉతకాలని సూచిస్తున్నారు. మరి లోదుస్తుల సంగతేంటీ అంటే సాధ్యమైనంత వరకు వాటిని మామూలుగా వాష్ చేసుకోవటం మంచిది.

Read more : World Rhino Day 2021 : ఖడ్గమృగాల గురించి ఆసక్తికర విషయాలు

మామూలుగా ఉతుక్కోవటం అంటే అది మన ఆరోగ్యానికి మంచిది. కరెంట్ ఆదా. పైగా పర్యావరణానికి మంచి చేయలేకపోయినా చెడు చేయనివారం అవుతాం. అంతేకాదు వాషింగ్ మిషన్ లో వేసిన దుస్తుల కంటే మనం మామూలుగా వాష్ చేసుకున్న దుస్తులే ఎక్కువ కాలం మన్నుతాయి. ఇంకా చాలా ఉపయోగాలున్నాయి. వాషింగ్ మిషన్ లో వేస్తే వాటర్ వాడకం చాలా ఎక్కువగా ఉంటుంది.అదే మామూలుగా వాష్ చేసుకుంటే తక్కువ వాటర్ ఖర్చు అవుతుంది. సో..వాషింగ్ మిషన్ వాడకుండా మామూలుగా వాష్ చేసుకుంటే కరెంటు ఆదా. నీరు ఆదా.సమయం కూడా ఆదా అవుతుంది. డిటర్జంట్ల ఆదాకూడా అవుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా ఈ పర్యావరణానికి మేలు చేసినవారం అవతుమనే తృప్తి దక్కుతుంది.