World Environment Day : జీవన విధానాలు మార్చుకుందాం..పర్యావరణాన్ని కాపాడుకుందాం

జీవన విధానాలను మార్చుకుని..కునారిల్లుతున్న పర్యావరణానికి ఊపిరి పోద్దామని ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. మనిషి రోజు రోజుకు తన జీవన విధానాన్ని మార్చుకుంటూ పోతున్నాడనీ..దీంతో పర్యావరణం కునారిల్లుపోతోందని ఇప్పటికైనా ప్రతీ ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడుకోవాల్సని అసవరం ఉందని సూచించారు.

World Environment Day : జీవన విధానాలు మార్చుకుందాం..పర్యావరణాన్ని కాపాడుకుందాం

World Environment Day

World Environment Day 2021 : జూన్ 5. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సోషల్ మీడియా ద్వారా సందేశం అందించారు.జీవన విధానాలను మార్చుకుని..కునారిల్లుతున్న పర్యావరణానికి ఊపిరి పోద్దామని సూచించారు. మనిషి రోజు రోజుకు తన జీవన విధానాన్ని మార్చుకుంటూ పోతున్నాడనీ..దీంతో పర్యావరణం కునారిల్లుపోతోందని ఇప్పటికైనా ప్రతీ ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడుకోవాల్సని అసవరం ఉందన్నారు. క్షీణ దశకు చేరుకుంటున్న మన పర్యావరణ వ్యవస్థలను పునరుద్ధరించేందుకు చేపడుతున్న రక్షణ చర్యలను మరింత తీవ్రతరం చేద్దామని వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు.

మన సాగు భూముల్లో సుస్థిర వ్యవసాయ విధానాలకు మారడం ద్వారా మన అడవులను పునర్నిర్మించుకుందాం, మన సముద్రాల కాలుష్యాన్ని నివారిద్దాం అని సూచించారు. పర్యావరణానికి హాని చేయని జీవన విధానాలను అలవర్చుకుందామని..విద్యుచ్ఛక్తి వినియోగంపై సామాజిక స్పృహ కలిగి వ్యవహరిద్దామని పిలుపునిచ్చారు. పలు రాకాలుగా విడుదల చేసే కర్బన ఉద్గారాలను కనిష్ఠ స్థాయికి తగ్గిద్దాం. మన పర్యావరణాన్ని కాపాడుకోవడం ద్వారా భవిష్యత్ తరాలకు ఆవాసయోగ్యమైన భూమండలాన్ని అందిద్దాం” అని వెంకయ్యనాయుడు ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు.

గాలి, నీరు, నిప్పు, ఆకాశం, భూమి పంచభూతాలు.. ప్రకృతిని మనం బాధ్యతగా ఉంటే ప్రకృతి మనల్ని అంతకంటే బాగా చూసుకుంటుంది. మనిషికి మాత్రమే సొంతం అనుకుంటే.. మిగిలిన జీవరాసులకూ సమాన హక్కు ఉన్న ప్రకృతిని మనిషి మాత్రమే వాడుకుంటే మనిషి మనుగడకే ప్రమాదం అవుతుంది. ప్రకృతిని ప్రేమిస్తూ.. పర్యావరణాన్ని రక్షిస్తూ.. ముందుకు సాగితే, ప్రకృతి మన భవిష్యత్ తరాలకు సాయం చేస్తుంది. వాతావరణ సంక్షోభం మన జీవితాల్లో కొన్ని కోలుకోలేని మార్పులకు గురిచేస్తోంది. ప్రకృతి విపత్తుల ప్రమాదాలతో హెచ్చరిస్తోంది. అయినా మనం పర్యావరణం కోసం ఆలోచించకపోతే మనిషి తన గొయ్యి తానే తవ్వకున్నట్లుగా అవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రపంచ పర్యావరణ దినోత్సవం అటవీ నిర్మూలన, ప్లాస్టిక్ వ్యర్థాలు వంటి సమస్యలను పరిష్కరించడంలో ప్రత్యేకమైన పరిష్కారాలను చర్చిస్తోంది ఐక్యరాజ్యసమితి.

ప్రపంచ పర్యావరణ దినోత్సవంను ప్రతీ ఏడాది జూన్ 5వ తేదిన జరుపుకుంటున్నారు. పర్యావరణానికి అనుకూలమైన చర్యలు తీసుకోవడానికి అవసరమైన ప్రపంచ అవగాహనను పెంచడానికి ఐక్యరాజ్యసమితి ఈమేరకు పర్యవరణ దినోత్సవం జరపాలని నిర్ణయించింది. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ (UNEP) ద్వారా ఈరోజును జరుపుతున్నారు. 1972 జూన్ 5వ తేదీ నుంచి 16వ తేది వరకు మానవ పర్యావరణంపై ఐక్యరాజ్యసమితి సమావేశం అయింది. ఈ సందర్భంగా 1972 లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ద్వారా ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఏర్పాటు చేసింది. 1973లో మొదటిసారి ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకున్నారు.