Himanta Biswa Sarma: “కేజ్రీవాల్ కు అంత దమ్ముందా?”.. అంటూ అసోం సీఎం హిమంత రిప్లై

హిమంత బిశ్వ శర్మ ఢిల్లీకి రావాలని కేజ్రీవాల్ ఆహ్వానించారు. దీంతో దీనిపై హిమంత బిశ్వ శర్మ స్పందిస్తూ కౌంటర్ ఇచ్చారు. ఓ లేఖ రాస్తానన్నారు.

Himanta Biswa Sarma: ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తనను ఢిల్లీకి ఆహ్వానించిన తీరుపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ స్పందించారు. “హిమంత బాబు.. మా ఇంటికి వచ్చి టీ తాగి వెళ్లండి” అంటూ కేజ్రీవాల్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపైనే హిమంత బిశ్వశర్మ మీడియాతో మాట్లాడారు.

“ఢిల్లీలో ఆప్ ప్రభుత్వ 12 లక్షల ఉద్యోగాలు ఇచ్చిందని సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీలో ఈ ఏడేళ్లలో 1.5 లక్షల ఉద్యోగాలే ఖాళీగా ఉంటే ఆయన ఏడు లక్షల ఉద్యోగాలు ఎలా ఇస్తారు? అసోంలో ప్రజల పరిస్థితులు ఢిల్లీ ప్రజల కంటే మెరుగ్గానే ఉన్నాయి. నన్ను ఢిల్లీకి కేజ్రీవాల్ ఆహ్వానించారు. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఢిల్లీలో నేను వెళ్లాలనుకుంటున్న చోటుకి నేను వెళ్తాను. కేజ్రీవాల్ సూచించిన చోటుకి కాదు. ఆయనకు నేనే లేఖ రాస్తాను. కేజ్రీవాల్ కి దమ్ముంటే దానికి సమాధానం ఇవ్వాలి” అని హిమంత బిశ్వ శర్మ అన్నారు.

కాగా, అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ఢిల్లీకి వచ్చి తన ఇంట్లో టీ తాగాలని, ఆయనకు తాను దేశ రాజధానికి దగ్గరుండి చూపిస్తానని ఇవాళ కేజ్రీవాల్ చెప్పారు. హిమంత బిశ్వశర్మ అసోం సంస్కృతి, సంప్రదాయాలను సరిగ్గా అర్థం చేసుకోవాలని కేజ్రీవాల్ అన్నారు. అంతేగానీ, అసోం వస్తే జైలు పెడతామని బెదిరింపులకు దిగవద్దని అన్నారు.

Sujana Chowdary : ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం, టీడీపీ నేతలతో సుజనా చౌదరి భేటీ.. దేనికి సంకేతం?

ట్రెండింగ్ వార్తలు