Sujana Chowdary : ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం, టీడీపీ నేతలతో సుజనా చౌదరి సమావేశం.. ఏం జరుగుతోంది?

Sujana Chowdary : వైసీపీ సర్కార్ ని తరిమివేస్తేనే ఏపీకి మంచి రోజులు వస్తాయని సుజనా చౌదరి అన్నారు. వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు..

Sujana Chowdary : ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం, టీడీపీ నేతలతో సుజనా చౌదరి సమావేశం.. ఏం జరుగుతోంది?

Sujana Chowdary : ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ నివాసానికి బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి వెళ్లారు. ఈ సందర్భంగా ఆలపాటి నివాసంలో సమావేశం జరిగింది. ఈ భేటీలో టీడీపీ నేతలు నక్కా ఆనంద్ బాబు, కన్నా లక్ష్మీనారాయణ కూడా పాల్గొన్నారు.

నేతలు పలు కీలక అంశాలపై చర్చించారు. వైసీపీ సర్కార్ ని తరిమివేస్తేనే ఏపీకి మంచి రోజులు వస్తాయని సుజనా చౌదరి అన్నారు. అమరావతిలో బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ పై దాడి చేయడం దారుణం అన్నారు. వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని సుజనా చౌదరి అన్నారు. ఇకనైనా వైసీపీ తన తీరు మార్చుకుంటే మంచిదని సుజనా చౌదరి హితవు పలికారు.(Sujana Chowdary)

Also Read..Chandrababu Naidu : ఎన్నికలు రేపు పెట్టినా సిద్ధం, జగన్‌ని ఇంటికి పంపడం ఖాయం-చంద్రబాబు

ఏపీలో జరుగుతున్న పరిణామాలపై అందరం ఏకం అవ్వాల్సిన అవసరం ఉందన్నారు సుజనా చౌదరి. ఇంటిపై ఘోరంగా దాడి చేసి మరీ దాన్ని సమర్ధించుకుంటున్నారంటే వారి సంస్కృతి ఏంటన్నది అర్థమవుతోందన్నారు.

”రైతుల కోసం వస్తే.. సత్యకుమార్ పై వైసీపీ నేతలు దాడి చేయడం దారుణం. వీటన్నింటిని ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలంతా ప్రతిఘటించాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రజలంతా ఇప్పుడున్న ప్రభుత్వాన్ని, అరాచక పాలనను తరిమికొడితే కానీ ఆంధ్రప్రదేశ్ కి, భావి తరానికి, యువ తరానికి ఏ మాత్రం కూడా భవిష్యత్తు ఉండదు అని తెలుసుకుంటున్నారు.

దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎలా చేస్తే బాగుంటుంది అనేది కొంతమంది స్నేహితులతో కూర్చుని డిస్కస్ చేయడం జరిగింది. దాడి చేయడమే కాకుండా దాడిని సమర్థించుకుంటున్నారు అంటే.. వాళ్ల సంస్కృతి ఏంటో తెలుసుకోవాలి. సభ్య సమాజంలో ఎవరు కూడా దాన్ని సమర్థించారు. ఇక, దానిలో బీజేపీ హైకమాండ్ మాట్లాడాల్సింది ఏమీ లేదు” అని సుజనా చౌదరి అన్నారు.(Sujana Chowdary)

మరోవైపు టీడీపీ నేతలతో బీజేపీ ఎంపీ సుజనా చౌదరి కీలక భేటీ ఆసక్తికరంగా మారింది. ఏపీ రాజకీయవర్గాల్లో చర్చకు దారితీసింది. టీడీపీ నేతలతో బీజేపీ ఎంపీ భేటీ దేనికి సంకేతం? అనే డిస్కషన్ జరుగుతోంది.

టీడీపీ నేతలతో సుజనా చౌదరితో మీటింగ్ విషయంపై టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజా కూడా స్పందించారు. తానే సుజనాను ఆహ్వానించానని ఆయన చెప్పారు. సత్యకుమార్ పై జరిగిన దాడిపై చర్చించామన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యవాదులు, ప్రతిపక్షాలన్నీ కలిసి పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ఆలపాటి రాజా పిలుపునిచ్చారు.(Sujana Chowdary)

Also Read..Manda Krishna Madiga: ఉండవల్లి శ్రీదేవికి అండగా నిలిచిన కృష్ణ మాదిగ.. వైసీపీకి స్ట్రాంగ్ వార్నింగ్

”రాష్ట్రం యొక్క పరిస్థితి ఏంటి? రాష్ట్రం ఎటువైపు పోతోంది? రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోతామనే అనే భావన ఇవాళ అందరిలోనూ ఉంది. ఏంటి పరిస్థితి అని, కేంద్రం వైఖరి ఏంటి? అని సుజనా చౌదరిని అడిగాము. కేంద్రం ఒకే రాజధానికి కట్టుబడి ఉన్నట్టుగానే కనపడుతోంది సుజనా చౌదరి చెప్పారు. ఏపీకి ఒకే రాజధాని, అదీ అమరావతే ఉంటుందనే ఒక నమ్మకం, విశ్వాసం అందరిలో కలిగించాలనే భావన ప్రతి ఒక్కరూ ఆశిస్తున్నారు” అని ఆలపాటి రాజా అన్నారు.