పాక్ లో ఉన్నది అతనేనా : మన పైలెట్ మిస్సింగ్ నిజమే
ఢిల్లీ: భారత మిగ్ 21 పైలెట్ మిస్సింగ్ వార్తలపై భారత విదేశాంగ స్పందించింది. భారత మిగ్ 21 పైలట్ తప్పిపోయాడని విదేశాంగ శాఖ అధికారికంగా ధృవీకరించింది. బుధవారం(ఫిబ్రవరి

ఢిల్లీ: భారత మిగ్ 21 పైలెట్ మిస్సింగ్ వార్తలపై భారత విదేశాంగ స్పందించింది. భారత మిగ్ 21 పైలట్ తప్పిపోయాడని విదేశాంగ శాఖ అధికారికంగా ధృవీకరించింది. బుధవారం(ఫిబ్రవరి
భారత మిగ్ 21 ఫైటర్ పైలెట్ మిస్సింగ్ వార్తలపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. భారత మిగ్ 21 పైలట్ తప్పిపోయిన మాట వాస్తవమే అని చెప్పింది. ఈ మేరకు విదేశాంగ శాఖ అధికారికంగా ధృవీకరించింది. బుధవారం(ఫిబ్రవరి 27) ఉదయం పాకిస్తాన్ ఫైటర్ జెట్లు మన భూభాగంలోకి ప్రవేశించి రాజౌరి సెక్టార్‌లో ఆర్మీ పోస్ట్‌లపై వైమానిక దాడులకు యత్నించాయని భారత విదేశాంగ అధికార ప్రతినిధి రవీష్ చెప్పారు. వెంటనే స్పందించిన భారత వైమానిక దళం.. పాక్‌కి చెందిన ఎఫ్ 16ని కూల్చేసిందని తెలిపారు. పాకిస్తాన్ భూభాగంలో అది కూలిందన్నారు.
Also Read: ఏది నిజం ఏది అబద్ధం : పాక్ అదుపులో భారత పైలెట్?
అయితే దాడి క్రమంలో భారత్‌కు చెందిన మిగ్ 21 విమానం ఒకటి పాక్ భూభాగంలో కూలిపోయిందని రవీష్ చెప్పారు. అందులో ఉన్న మన పైలెట్ అభినందన్ మిస్ అయిన మాట వాస్తవమే అన్నారు. అభినందన్ ఆచూకీ తెలియాల్సి ఉందన్నారు. మన ఐఏఎఫ్ పైలట్ పాకిస్తాన్ కస్టడీలో ఉన్నట్టు వారు చెప్పుకుంటున్నారని, దీని గురించి వాస్తవ పరిస్థితులు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని రవీష్ కుమార్ చెప్పారు.
పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం ఫిబ్రవరి 26న తెల్లవారుజామున దాడులు చేసిన సంగతి తెలిసిందే. పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి మరీ ఉగ్రవాదులను చావుదెబ్బ తీశాం. దీంతో అసూయతో రగిలిపోతున్న పాకిస్తాన్.. భారత్ పై ప్రతిదాడికి ప్రయత్నించింది. 3 పాక్ జెట్ విమానాలు బుధవారం(ఫిబ్రవరి 27) భారత గగనతలంలోకి వచ్చాయి. సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులకు యత్నించాయి. అప్రమత్తమైన భారత వైమానిక దళం వారి దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టింది. పాకిస్తాన్‌కు చెందిన ఎఫ్ 16 యుద్ధ విమానాన్ని కూల్చేసింది. అయితే ఈ ఘటనలో భారత్‌కు చెందిన మిగ్-21 విమానం ఒకటి పాక్ భూభాగంలో కూలిపోయింది. అందులోని వింగ్ కమాండర్ మిస్ అయ్యారని భారత విదేశాంగశాఖ ప్రతినిధి తెలిపారు.