ఫైటర్ జెట్ లు రెడీ : సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు

  • Published By: venkaiahnaidu ,Published On : February 17, 2019 / 05:04 AM IST
ఫైటర్ జెట్ లు రెడీ : సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు

Updated On : February 17, 2019 / 5:04 AM IST

పుల్వామా దాడితో రగిలిపోతున్న భారత సైన్యం పాక్ కు బుద్ధి చెప్పేందుకు రెడీగా ఉంది. పాక్ తో ఇకపై చర్చలు ఉందకూడదు అని భారత్ భావించింది. భారత్-పాక్ పశ్చిమ సరిహద్దుల్లో  భారత వాయుసేకు చెందిన 81 యుద్ధ విమానాలు మొహరించాయి. టాప్ ఇండియన్ ఫైటర్ జెట్ లు మిరాజ్ 2000, మిగ్-29, జాగ్వార్, ఎస్ యూ-30 లు కూడా వాటిలో ఉన్నాయి. రాజస్థాన్ లోని పోఖ్రాన్ దగ్గర వాయు శక్తి ఎక్సర్ సైజ్ లో ఈ యుద్ధ విమానాలు పాల్గొంటున్నాయి.

గ్రౌండ్ లెవల్లోని టార్గెట్స్ ని గుర్తించి పూర్తిగా శత్రుమూకల ఆస్తులను క్షణాల్లో ధ్వంసం చేసేందుకు ఇది ప్రదర్శించబడుతుంది.పోఖ్రాన్ లో ఉపరితలం నుంచి గాల్లోకి మిసైల్స్ పరీక్షలు శనివారం(ఫిబ్రవరి-16,2019) విజయవంతంగా జరిగాయి. దీన్ని బట్టి చూస్తే పాక్ పై యుద్ధానికి భారత్ రెడీ అయినట్లు కన్పిస్తోంది. 
మరోవైపు భారత్ యుద్ధవిమానాలతో సరిహద్ధు నుంచి విరుచుకుపడే ప్రమాదం ఉందని భావించిన పాక్  కూడా సరిహద్దుల దగ్గర తమ సైన్యాన్ని అప్రమత్తం చేసింది.

మన దేశ రాజకీయ నాయకత్వం నియమించినట్లు తగిన స్పందనను అందించడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని, IAF తన మిషన్స్ ని ఎగ్జిక్యూట్ చేయడంలో ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుందని  ఎయిర్ చీఫ్ మార్షల్ బి.ఎస్.ధనోవా తెలిపారు.