Farmers End 15-Month Protest : ఇది తాత్కాలిక విరమణే..ప్రభుత్వం మాట తప్పితే మళ్లీ ఉద్యమం!

378రోజులుగా దేశ రాజధాని సరిహద్దుల్లో రైతులు చేస్తోన్న ఉద్యమం నేటితో ముగిసింది. రైతుల డిమాండ్లలో ప్రధానమైన మూడు వ్యవసాయ చట్టాలను ఇప్పటికే రద్దు చేసిన కేంద్రం...పంటలకు కనీస మద్దతు ధర

Farmers End 15-Month Protest :  378రోజులుగా దేశ రాజధాని సరిహద్దుల్లో రైతులు చేస్తోన్న ఉద్యమం నేటితో ముగిసింది. రైతుల డిమాండ్లలో ప్రధానమైన మూడు వ్యవసాయ చట్టాలను ఇప్పటికే రద్దు చేసిన కేంద్రం…పంటలకు కనీస మద్దతు ధర(MSP)కు చట్టబద్దమైన హామీ,ఉద్యమ సమయంలో అన్ని రాష్ట్రాల్లో రైతులపై పెట్టిన కేసుల ఉపసంహరణకు అంగీకరిస్తూ రైతు సంఘాలకు మంగళవారం ఓ లేఖ పంపిన విషయం తెలిసిందే.

విద్యుత్ సవరణ బిల్లును పార్లమెంట్‌లో చర్చించే ముందు ప్రభుత్వం రైతు సంఘాలతో చర్చించడం, MSPపై కమిటీ ఏర్పాటు చేయడం, దీనిలో SKM దాని సభ్యులను చేర్చడం, దేశంలో కొనసాగుతున్న MSP, ధాన్యం సేకరణ యథాతథంగా కొనసాగడం వంటివి ఈ లేఖలో పేర్కొన్నారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా సాగిన ఆందోళనల సందర్భంగా.. మరణించిన రైతుల కుటుంబాలకు పరిహారం ఇచ్చేందుకు ఉత్తరప్రదేశ్‌, హరియాణా ప్రభుత్వాలు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపాయి. ఈ విషయాన్నీ లేఖలో ప్రస్తావించింది కేంద్రం. రైతుల డిమాండ్లపై తాజాగా మరోసారి లిఖిత పూర్వకంగా SKMకి కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సంజయ్ అగర్వాల్ లేఖ రాశారు.

రైతుల అన్ని డిమాండ్లకు కేంద్రం అంగీకరించిన నేపథ్యంలో ఈరోజు జరిగిన సంయుక్త కిసాన్ మోర్చా(SKM) సమావేశంలో ఉద్యమాన్ని ముగింపు పలకాలని రైతు సంఘాలు నిర్ణయించారు. ఉద్యమం ముగిసినట్లు SKM ప్రకటించడంతో ఇళ్లకు తిరిగి వెళ్ళేందుకు రైతులు సిద్ధమవుతున్నారు.

అయితే తమ ఆందోళ‌న‌ల‌ను తాత్కాలికంగా విర‌మిస్తున్న‌ట్లు సంయుక్త కిసాన్ మోర్చా నేత గురునామ్ సింగ్ చౌరానీ పేర్కొన్నారు. జ‌న‌వ‌రి 15న మ‌రోసారి SKM స‌మావేశమ‌వుతుందని ఆయన తెలిపారు. ప్ర‌స్తుతానికి ప్ర‌భుత్వం త‌మ‌కు కొన్ని హామీల‌ను ఇచ్చింద‌ని, అందుకే త‌మ ఉద్య‌మానికి తాత్కాలికంగా విరామం ప్ర‌క‌టించామ‌ని అన్నారు. ప్ర‌భుత్వం ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చ‌ని ప‌క్షంలో మ‌రోసారి ఉద్య‌మానికి స‌న్న‌ద్ధ‌మ‌వడం ఖాయ‌మ‌ని గురునామ్ సింగ్ తేల్చి చెప్పారు.

సింఘూ స‌రిహ‌ద్దు ప్రాంతాల‌ను తాము శుక్ర‌వారం సాయంత్రం నుంచి ఖాళీ చేయ‌డం ప్రారంభిస్తామ‌ని మ‌రో రైతు నేత బ‌ల్వీర్ రాజేవాల్ తెలిపారు. 11వ తేది ఉదయం 9 గంటల లోపు రైతులు బార్డర్ ఖాళీ చేస్తారని తెలిపారు. 13వ తేదిన పంజాబ్ రైతులంతా గోల్డెన్ టెంపుల్ సందర్శిస్తారని రైతు అశోక్ ధావ‌లే తెలిపారు.

ALSO READ Farmers End 15-Month Protest : ముగిసిన రైతు ఉద్యమం..అన్నదాత పోరు సాగిందిలా

ALSO READ Farmers protest Ends : ముగిసిన రైతు ఉద్యమం..378రోజుల తర్వాత తిరిగి ఇళ్లకు అన్నదాతలు

ట్రెండింగ్ వార్తలు