Farmers End 15-Month Protest : ముగిసిన రైతు ఉద్యమం..అన్నదాత పోరు సాగిందిలా

దేశ రాజధాని సరిహద్దుల్లో ఏడాకిపైగా రైతులు చేస్తోన్న ఉద్యమం ముగిసింది. రైతుల డిమాండ్లలో ప్రధానమైన మూడు వ్యవసాయ చట్టాలను ఇప్పటికే రద్దు చేసిన కేంద్రం...పంటలకు కనీస మద్దతు ధర(MSP)కు

Farmers End 15-Month Protest : ముగిసిన రైతు ఉద్యమం..అన్నదాత పోరు సాగిందిలా

Fm58

Farmers End 15-Month Protest :  దేశ రాజధాని సరిహద్దుల్లో ఏడాకిపైగా రైతులు చేస్తోన్న ఉద్యమం ముగిసింది. రైతుల డిమాండ్లలో ప్రధానమైన మూడు వ్యవసాయ చట్టాలను ఇప్పటికే రద్దు చేసిన కేంద్రం…పంటలకు కనీస మద్దతు ధర(MSP)కు చట్టబద్దమైన హామీ,ఉద్యమ సమయంలో రైతులపై పెట్టిన కేసుల ఉపసంహరణకు అంగీకరిస్తూ రైతు సంఘాలకు కేంద్రం ఓ డ్రాఫ్ట్ లేఖను పంపిన నేపథ్యంలో…దీనిపై ఇవాళ సమావేశమై చర్చించిన సంయుక్త కిసాన్ మోర్చా(SKM)ఉద్యమాన్ని ముగిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో 378 రోజుల ఆందోళన తర్వాత ఢిల్లీ సరిహద్దుల నుంచి తమ ఇళ్లకు తిరిగి వెళ్లేందుకు రైతులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సింఘూ సరిహద్దుల్లో ఏర్పాటు చేసుకున్న తమ తాత్కాలిక శిబిరాలను రైతులు తొలగిస్తున్నారు.

రైతు ఉద్యమం సాగిందిలా
– జూన్-5,2020న కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ రూపంలో మూడు వ్యవసాయ బిల్లులను తీసుకొచ్చింది.
– సెప్టెంబర్-14,2020న బిల్లులను పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన కేంద్రం
-సెప్టెంబర్-17,2020న మూడు వ్యవసాయ చట్టాల బిల్లులకు లోక్ సభ ఆమోదం
–సెప్టెంబర్-20,2020న మూడు వ్యవసాయ చట్టాల బిల్లులకు మూజువాణి ఓటుతో రాజ్యసభ ఆమోదం
-సెప్టెంబర్-25,2020న మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్త నిరసనలకు రైతు సంఘాలు పిలుపు
-సెప్టెంబర్-26,2020న సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఎన్డీయే ప్రభుత్వం నుంచి తప్పుకున్న శిరోమణి అకాళీదల్
-సెప్టెంబర్-27,2020న మూడు వ్యవసాయ చట్టాల బిల్లులకు రాజ్యసభ ఆమోదం
-నవంబర్-25,2020న చలో ఢిల్లీకి రైతు సంఘాల పిలుపు
-నవంబర్-26,2020న ఢిల్లీ వైపు దూసుకెళ్లిన రైతులపై భాష్పవాయువు,జలఫిరంగులను ప్రయోగించిన పోలీసులు
-డిసెంబర్-3,2020న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ నేతృత్వంలో రైతు సంఘాల నేతలతో ప్రభుత్వం చర్చలు ప్రారంభం
-డిసెంబర్-5,2020న ప్రభుత్వంతో రైతు సంఘాల నేతల చర్చలు మళ్లీ అసంపూర్తిగా ముగింపు
-డిసెంబర్-8,2020న భారత్ బంద్ కు పిలుపునిచ్చిన రైతులు
-డిసెంబర్-9,2020న వ్యవసాయ చట్టాల్లో సవరణలకు కేంద్రం ప్రతిపాదన..తిరస్కరించిన రైతులు
-డిసెంబర్-11,2020న వ్యవసాయ చట్టాల విషయమై సుప్రీం కోర్టుని ఆశ్రయించిన రైతులు
-జనవరి-7,2021న వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై విచారణకు అంగీకరించిన సుప్రీంకోర్టు
-జనవరి-11,2021న మాజీ సీజేఐ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేస్తామన్న సుప్రీంకోర్టు
-జనవరి-12,2021న వ్యవసాయ చట్టాల అమలుపై స్టే విధించిన కోర్టు..నిపుణుల కమిటీ ఏర్పాటు
-జనవరి-26,2021న రిపబ్లిక్ డే రోజున ట్రాక్టర్లతో ఢిల్లీలోని ఎర్రకోట వైపు దూసుకెళ్లిన రైతులు..ఆందోళనల్లో పలువురు మృతి,మరికొందరికి గాయాలు
-మార్చి-6,2021న ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళనకు 100 రోజులు పూర్తి
-అక్టోబర్-3,2021న ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరీ జిల్లాల్లో రైతుల ఆందోళన సందర్భంగా చెలరేగిన హింస..నలుగురు అన్నదాతలు మృతి
-నవంబర్-19,2021న మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన ప్రధాని మోదీ. రైతులకు క్షమాపణ చెప్పిన ప్రధాని
-నవంబర్-29,2021న మూడు వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుకి పార్లమెంట్ ఆమోదం
-డిసెంబర్-1,2021న మూడు వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుపై రాష్ట్రపతి సంతకం
-డిసెంబర్-7,2021 రైతుల అన్ని డిమాండ్లకు అంగీకరిస్తూ డ్రాఫ్ట్ రూపంలో రైతు సంఘాలకు ఓ లేఖ పంపిన కేంద్రం
-డిసెంబర్-9,2021 378 రోజుల నుంచి సాగిన రైతుల ఉద్యమం ముగిసినట్లు ప్రకటించిన సంయుక్త కిసాన్ మోర్చా. ఇళ్లకు తిరిగి వెళ్లే ఏర్పాట్లు చేసుకుంటున్న అన్నదాతలు

ALSO READ Farmers protest Ends : ముగిసిన రైతు ఉద్యమం..378రోజుల తర్వాత తిరిగి ఇళ్లకు అన్నదాతలు