IIM Calcutta: సమ్మర్ ఇంటర్న్‌షిప్‌లో ఐఐఎం కలకత్తా విద్యార్థులకు దక్కిన స్టైపెండ్ ఎంతో తెలుసా?
తమ ప్రథమ సంవత్సర విద్యార్థుల సమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్లేస్‌మెంట్ సైకిల్‌ను అక్టోబరు 18న పూర్తి చేశామని ఐఐఎం కలకత్తా తెలిపింది.

IIM Calcutta
Summer internship: ఐఐఎం కలకత్తా ఎంబీఏ ప్రథమ సంవత్సర విద్యార్థులు సమ్మర్ ఇంటెర్న్‌షిప్ కింద ప్రతి నెల రూ.1.65 లక్షల యావరేజ్ స్టైపెండ్ అందుకున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఐఐఎం కలకత్తా ఓ ప్రకటన చేసింది.
ప్రస్తుతం మార్కెట్లో సవాళ్లతో కూడుకున్న పరిస్థితులు ఉన్నప్పటికీ తమ ప్రథమ సంవత్సర విద్యార్థుల సమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్లేస్‌మెంట్ సైకిల్‌ను అక్టోబరు 18న పూర్తి చేశామని తెలిపింది. 60వ బ్యాచ్ సమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్లేస్‌మెంట్ వీక్‌లో 466 మంది విద్యార్థులకు మొత్తం కలిపి 513 ఆఫర్లు వచ్చాయని పేర్కొంది.
విద్యార్థులకు అందించిన అత్యధిక స్టైపెండ్ నెలకు రూ.3.75 లక్షలని తెలిపింది. బ్యాచ్ లోని టాప్ 25 శాతం మందికి అందించిన యావరేజ్ స్టైపెండ్ నెలకు రూ.2.31 లక్షలని చెప్పింది. తమ సంస్థలో చదువుతోన్న ప్రతి విద్యార్థికి ప్లేస్‌మెంట్ దక్కాలనే ఉద్దేశంతో తాము పనిచేస్తున్నామని ఐఐఎం కలకత్తా చెప్పింది. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని జోకా డైమండ్ హార్బర్ రోడ్ లో ఐఐఎం కలకత్తా అడ్మిషన్స్ ఆఫీస్, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఉంటాయి.
Job offer: ఐఐటీ, ఐఐఎంలో చదవలేదు.. అయినా మొదట 32 లక్షల ప్యాకేజీతో జాబ్ ఆఫర్.. ఇప్పుడు 56 లక్షలతో..