లుంగీలు, బెడ్‌షీట్ల సాయంతో 20 అడుగుల గోడను దూకి జైలు నుంచి పారిపోయిన నిందితులు

దుప్పట్లు, లుంగీలు, బెడ్‌షీట్‌లను ఉపయోగించి 20 అడుగుల కాంపౌండ్ వాల్‌ను ఎక్కి, జైలు బయటికి దూకి పారిపోయారు.

లుంగీలు, బెడ్‌షీట్ల సాయంతో 20 అడుగుల గోడను దూకి జైలు నుంచి పారిపోయిన నిందితులు

Updated On : October 12, 2024 / 8:22 AM IST

జైలులో ఉంటూ విచారణ ఎదుర్కొంటున్న ఐదుగురు యువకులు లుంగీలు, బెడ్‌షీట్ల సాయంతో గోడ దూకి పారిపోయారు. ఈ ఘటన అసోంలోని మోరిగావ్ జిల్లా జైలులో చోటుచేసుకుంది. దీనిపై అధికారులు విచారణ చేపట్టారు.

పారిపోయిన ఖైదీల పేర్లను సైఫుద్దీన్, జియారుల్ ఇస్లాం, నూర్ ఇస్లాం, మఫీదుల్, అబ్దుల్ రషీద్‌గా అధికారులు గుర్తించారు. వారంతా పోక్సో చట్టం కింద అరెస్టయి జైలులో ఉంటూ విచారణ ఎదుర్కొంటున్నారు. నిన్న అర్ధరాత్రి దాటాక వారు ఐదుగురు బ్యారక్‌ల రాడ్లను పగలగొట్టారు.

దుప్పట్లు, లుంగీలు, బెడ్‌షీట్‌లను ఉపయోగించి 20 అడుగుల కాంపౌండ్ వాల్‌ను ఎక్కి, జైలు బయటికి దూకి పారిపోయారు. ఈ ఘటనతో జైలర్ ప్రశాంత సైకియాను అధికారులు సస్పెండ్ చేశారు. అలాగే, గువాహటికి చెందిన ఇద్దరు అసిస్టెంట్ జైలర్‌లను తాత్కాలికంగా ఈ జైలులో విధుల నిర్వహణ కోసం నియమించారు.

నిందితులు పారిపోయిన ఘటనపై జైళ్ల శాఖ ఇన్‌స్పెక్టర్ జనరల్ పుబాలి గోహైన్ ప్రత్యేక శాఖాపరమైన విచారణను నిర్వహించనున్నారు. పారిపోయిన ఆ ఐదుగురు నిందితులను గుర్తించేందుకు గాలింపు చర్యలు ప్రారంభించినట్లు మోరిగావ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హేమంత కుమార్ దాస్ తెలిపారు. కొంతమంది జైలు ఖైదీలను విచారిస్తామని, విచారణలో ప్రతిదీ బయటపడుతుందని ఆయన చెప్పారు.

Shayaji Shinde : మొన్న పవన్ కళ్యాణ్ ని కలిసి.. నేడు వేరే పార్టీలో చేరిన షాయాజీ షిండే..