Odisha : కస్టమర్‌కి రూ.3 ఇవ్వకపోవడం వల్ల ఓ షాప్ ఓనర్ ఎంత జరిమానా కట్టాడంటే?

కొన్ని షాపుల్లో యజమానులు కస్టమర్లకు చిల్లర తిరిగి ఇవ్వాల్సిన సందర్భాల్లో ఏదో సాకుతో ఎగ్గొట్టేస్తుంటారు. పోనీలే ఒక రూపాయికేంటి? అని కొందరు కస్టమర్లు వదిలేసుకుంటారు. కానీ ఒకాయన షాపు యజమానికి ఇవ్వాల్సిన రూ.3 కోసం ఎక్కడి దాకా వెళ్లాడో చదవండి.

Odisha : కస్టమర్‌కి రూ.3 ఇవ్వకపోవడం వల్ల ఓ షాప్ ఓనర్ ఎంత జరిమానా కట్టాడంటే?

Odisha

Odisha : కస్టమర్‌కి రూ.3 తిరిగి ఇవ్వడానికి నిరాకరించిన షాపు యజమాని రూ.25,000 జరిమానా కట్టిన సంఘటన ఒడిశాలో జరిగింది.

Gujarat : బెయిల్ వచ్చినా 3 ఏళ్లుగా అతను జైల్లోనే.. ఈమెయిల్ చూడని అధికారులకు కోర్టు జరిమానా..

ఒడిశా సంబల్‌పూర్ జిల్లాలోని బుధరాజా ప్రాంతానికి చెందిన ప్రఫుల్ల కురార్ దాష్ అనే జర్నలిస్టు 2023 ఏప్రిల్ 28 న కొన్ని పేపర్లు జిరాక్స్ తీసుకోవడానికి ఓ జిరాక్స్ షాప్‌కి వెళ్లారు. జిరాక్స్ కాపీల కోసం ఆయన రూ.5 ఇచ్చారు. వాటికి రూ.2 కావడంతో షాపు ఓనర్ రూ.3 జర్నలిస్టుకి తిరిగి ఇవ్వాల్సి ఉంది. అయితే షాపు యజమానికి అందుకు నిరాకరించాడు. అంతేకాదు ప్రఫుల్ల కురార్ దాష్‌ను నోటికి వచ్చినట్లు దుర్భాషలాడాడు.

Burqas Baned : బుర్ఖా వేసుకుంటే భారీ జరిమానా .. కొత్త చట్టం తెచ్చిన దేశం

చివరికి తాను బిచ్చం వేస్తున్నానంటూ జిరాక్స్ షాపు యజమాని రూ.5 ప్రఫుల్ల కురార్ దాష్‌కి తిరిగి ఇచ్చాడు. దీంతో మానసిక వేదన, వేధింపులు, అసౌకర్యానికి గురైన అతను జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌లో ఫిర్యాదు చేసాడు. ఫలితంగా జిరాక్స్ షాపు యజమానికి రూ.25,000 జరిమానా చెల్లించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఇది తను వ్యక్తిగత విషయంగా తీసుకోలేదని వినియోగదారుల హక్కుగా, తను అవమానించబడటంతో ఫిర్యాదు చేసినట్లు ప్రఫుల్ల కురార్ దాష్ పేర్కొన్నారు. గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకూ తెచ్చుకున్నట్లు అన్న సామెతగా మారింది షాపు యజమాని పరిస్థితి.