Govt Hikes Interest Rates: పొదుపు పథకాలపై వడ్డీరేట్ల పెంపు.. రేపటి నుంచి అమల్లోకి
పోస్టాఫీసు టర్మ్ డిపాజిట్లు, ఎన్ఎస్‌సీ, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లతో సహా చిన్న డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతూ కేంద్రం నిర్ణయించింది. పెరిగిన వడ్డీ రేట్లు జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

Saving schemes
Govt Hikes Interest Rates: పోస్టాఫీసు టర్మ్ డిపాజిట్లు, ఎన్ఎస్‌సీ, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లతో సహా చిన్న డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతూ కేంద్రం నిర్ణయించింది. పెరిగిన వడ్డీ రేట్లు జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) దేశంలో వడ్డీ రేట్లను పెంచుతున్న తరుణంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. రేటు పెంపుదల 20బీపీఎస్, 110 బీపీఎస్ పరిధిలో చేయబడింది.
ప్రభుత్వం తాజా నిర్ణయం ప్రకారం..
♦ జాతీయ పొదుపు పత్రం (ఎన్ఎస్‌సీ) పథకానికి ప్రస్తుతం ఉన్న 6.8 శాతం వడ్డీరేటును 7శాతానికి, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ కు 7.6 శాతం ఉన్న వడ్డీ రేటును 8శాతానికి పెంచింది.
♦ 1 నుంచి 5ఏళ్ల కాల పరిమితితో ఉండే పోస్టాఫీస్ టెర్మ్ డిపాజిట్ స్కీమ్‍లకు వడ్డీ రేట్లు 1.1 బేస్ పాయింట్ల వరకు పెరిగాయి.
♦ ఒక సంవత్సరం టెర్మ్ డిపాజిట్లకు 6.6 శాతం
♦ రెండు సంవత్సరాల టెర్మ్ డిపాజిటర్లకు 6.8శాతం
♦ మూడు సంవత్సరాల టర్మ్ డిపాజిట్లకు 6.9శాతం
♦ ఐదు సంవత్సరాల టెర్మ్ డిపాజిట్లకు 7.0 శాతం వడ్డీ రేటు అమల్లోకి రానున్నాయి.
♦ నెలవారీ ఆదాయ పథకానికి వడ్డీరేటు ప్రస్తుతం ఉన్న 6.7 నుంచి 7.1 శాతానికి పెరిగింది.
♦ కిసాన్ వికాస్ పత్ర పథకానికి సంబంధించి వడ్డీ రేటును 7.0 నుంచి 7.2కు పెంచి, మెచ్యురిటీ సమయాన్ని 123 నుంచి 120 నెలలకు ప్రభుత్వం తగ్గించింది.
♦ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), సుకన్య సమృద్ధి యోజన పథకాల ప్రస్తుత వడ్డీ రేట్లలో మార్పులు చేయలేదు.

Govt of India increases interest rates on small saving schemes