India-China: బలగాల ఉపసంహరణపైనే.. భారత్‌, చైనా 13వ రౌండ్‌ చర్చలు

భారత్‌, చైనా మధ్య 13వ రౌండ్‌ కార్ప్స్‌ కమాండర్‌ స్థాయి చర్చలు జరిగాయి. చైనా మాల్దో ప్రాంతంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు చర్చలు జరిగాయి.

India asks China for troop disengagement : భారత్‌, చైనా మధ్య 13వ రౌండ్‌ కార్ప్స్‌ కమాండర్‌ స్థాయి చర్చలు జరిగాయి. చైనా మాల్దో ప్రాంతంలో ఆదివారం (అక్టోబర్ 9) ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు చర్చలు జరిగాయి. హాట్‌స్ప్రింగ్స్‌ ప్రాంతంలోని పెట్రోలింగ్‌ పాయింట్‌ 15 నుంచి మూడో దశ బలగాల ఉపసంహరణపై ప్రధానంగా చర్చలు జరిగినట్టు రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి. తూర్పు లడఖ్‌లోని వాస్తవధీన రేఖ (LAC) వెంబడి మొత్తం బలగాలను ఉపసంహరించుకోవడం, ఉద్రిక్తతలు తగ్గించడంపై భారత్‌, చైనా అధికారులు చర్చలు జరిగాయి.

ఈ చర్చల్లో భారత్‌ తరపున లేహ్ కేంద్రంగా పనిచేసే 14 కార్ప్స్‌ కమాండర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ పిజికె.మీనన్‌ నేతృత్వంలోని బృందం పాల్గొందని రక్షణశాఖ అధికారి తెలిపారు. బలగాల ఉపసంహరణ, ఉద్రిక్తతలు తగ్గడానికి ఇరుదేశాల జవాన్ల మధ్య మరోసారి ఘర్షణలు చోటుచేసుకోకుండా పెట్రోలింగ్‌కు సంబంధించి కొత్త ప్రొటోకాల్స్‌ రూపొందించడంపై కలిసి పనిచేయాలని రెండు దేశాలకు చెందిన అధికారులు ఒక అంగీకారానికి వచ్చారు. గతేడాది మే నెలలో చోటుచేసుకున్న తర్వాత నెలకొన్న ప్రతిష్టంభన నేపథ్యంలో భారత్‌, చైనాకు చెందిన అధికారులు ఇప్పటికే పలు స్థాయిల్లో చర్చలు జరిపారు. ఆయా సమావేశాల్లో కుదిరిన ఒప్పందాల్లో ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్యాంగ్యాంగ్‌‌తో సరస్సుకు ఇరువైపులా, ఆగస్టులో గోగ్రాలోని పెట్రోలింగ్‌ పాయింట్‌ 17 వద్ద ఇరుదేశాలకు చెందిన బలగాల ఉపసంహరణ జరిగింది.
High Court : నేడు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మ ప్రమాణ స్వీకారం

పెట్రోలింగ్ పాయింట్ 15 వద్ద బలగాలను ఉపసంహరణ పూర్తి చేయడం కార్ప్స్ కమాండర్-స్థాయి చర్చల్లో ప్రధానంగా దృష్టిపెట్టినట్టుగా తెలుస్తోంది. తూర్పు లడఖ్‌లోని చుషుల్-మోల్డో బోర్డర్ పాయింట్‌లో చైనా వైపు జరిగిన చర్చలపై అధికారికంగా ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఇరుదేశాల మధ్య చర్చలు, ఉదయం 10:30 గంటలకు ప్రారంభమై రాత్రి 7 గంటలకు ముగిశాయి. రెండు నెలల తర్వాత చివరి రౌండ్ చర్చలు జరిగాయి. రెండు దేశాల మధ్య సంబంధాలు మొత్తం మెరుగుపడాలంటే డెప్సాంగ్‌తో సహా అన్ని పాయింట్‌లలోని సమస్యల పరిష్కారం అత్యవసరమని భారత్ భావిస్తోంది. డెప్సాంగ్ వద్ద ఉద్రిక్తతలను తగ్గించడానికి 13వ రౌండ్ చర్చల సమయంలో భారత ప్రతినిధి బృందం ఇదే అంశాన్ని లేవనెత్తింది. చైనా దళాలు ఇటీవల ఉల్లంఘనకు ప్రయత్నించిన నేపథ్యంలో ఈ చర్చలు జరిగాయి.

ఉత్తరాఖండ్‌లోని బరహోటి సెక్టార్‌లో, మరొకటి అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లో చైనా దళాలు ఉల్లంఘనకు పాల్పడ్డాయి. జూలై 31న ఇరువర్గాలు 12వ రౌండ్ చర్చలు జరిగాయి. రోజుల తరువాత, రెండు సైన్యాలు గోగ్రాలో విడపోయాయి. ఈ ప్రాంతంలో శాంతి, ప్రశాంతతను పునరుద్ధరించే దిశగా ముందడుగు వేశాయి. ఆదివారం జరిగిన చర్చలలో భారత ప్రతినిధి బృందానికి లెహ్ ఆధారిత 14 కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ పిజికె మీనన్ నాయకత్వం వహించారు. పాంగాంగ్ సరస్సు ప్రాంతాలలో హింసాత్మక ఘర్షణ తరువాత గత ఏడాది మే 5న భారత, చైనా మిలిటరీల మధ్య సరిహద్దు ప్రతిష్టంభన తలెత్తింది. పదివేల మంది సైనికులతో పాటు భారీ ఆయుధాలతో ఇరుపక్షాలు ముందుకు దూసుకెళ్లాయి. సైనిక, దౌత్య చర్చల ఫలితంగా, ఇరుపక్షాలు ఆగస్టులో గోగ్రా ప్రాంతంలో ఈ ప్రక్రియను పూర్తి చేశాయి. ప్రస్తుతం వాస్తవ నియంత్రణ రేఖ (LAC) వెంట దాదాపు 50వేల నుంచి 60వేల మంది సైనికులు ఉన్నారు.
Civilian Killings : భద్రతా దళాల అదుపులో 700మంది ఉగ్రవాద సానుభూతిపరులు

ట్రెండింగ్ వార్తలు