Civilian Killings : భద్రతా దళాల అదుపులో 700మంది ఉగ్రవాద సానుభూతిపరులు

జమ్మూ కశ్మీర్‌లో గడిచిన ఆరు రోజుల్లో అక్కడి ప్రజలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఏడుగురు పౌరులు మృతిచెందారు.

Civilian Killings : భద్రతా దళాల అదుపులో 700మంది ఉగ్రవాద సానుభూతిపరులు

Terrorist Sympathisers : జమ్మూ కశ్మీర్‌లో గడిచిన ఆరు రోజుల్లో అక్కడి ప్రజలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఏడుగురు పౌరులు మృతిచెందారు. హిందువులు, సిక్కులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు ఈ దాడులు పాల్పుడుతున్నారంటూ స్థానికంగా పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టారు. ఈ ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఉన్నతాధికారుల ఆదేశాలతో భద్రతా దళాలు భారీ ఎత్తున తనిఖీలు చేపట్టాయి. శ్రీనగర్ లో దాదాపు 700 మంది ఉగ్రవాద సానూభూతిపరులను అదుపులోకి తీసుకున్నారు. జమ్మూకశ్మీర్ వ్యాప్తంగా మొత్తం 700మందికి పైగా సానూభూతిపరులను భద్రతా దళాలు నిర్బంధించినట్టు తెలుస్తోంది.
Tragedy : ఇద్దరు పిల్లలను ఊరివేసి చంపిన తల్లి

రాళ్ల దాడులకు పాల్పడినవారితో పాటు అనుమానితులను స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఇంటెలిజెన్స్ బ్యూరో ఉన్నతాధికారిని ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల సమన్వయానికి శ్రీనగర్‌కు కేంద్రం పంపినట్టు తెలుస్తోంది. స్థానికంగా ఉగ్రవాద సంబంధిత కార్యకలాపాలను అరికట్టడంలో భాగంగా జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) అనంతనాగ్‌, శ్రీనగర్‌, కుల్గాం, బారాముల్లా తదితర 16 చోట్ల ఏకకాలంలో దాడులు నిర్వహించింది.

లష్కరే తోయిబా తదితర ఉగ్రసంస్థల సపోర్టుతో లోయలో పౌరుల ఊచకోత చర్యలకు పాల్పడుతున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. వాయిస్‌ ఆఫ్ హింద్‌, ది రెసిస్టెన్స్‌ ఫోర్స్‌(TRF) కేసుల దర్యాప్తులో భాగంగా ఈ సంస్థ సభ్యుల ఇళ్లపై దాడులు జరుపుతోంది. ఈ ఏడాదిలో ఉగ్ర దాడుల్లో మొత్తం 28 మంది పౌరులు మృతి చెందినట్లు జమ్మూ- కశ్మీర్‌ పోలీసులు వెల్లడించారు. ఇటీవల ఇద్దరు అధ్యాపకులను ఉగ్రవాదులు దారుణంగా కాల్చి చంపేశారు.
Big Boss 5: ఒకవైపు ఫుల్‌ప్యాక్ ఎంటర్టైన్మెంట్.. మరోవైపు ఎలిమినేషన్ ఎమోషన్!