Tragedy : ఇద్దరు పిల్లలను ఉరి వేసి చంపిన తల్లి

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి లో దారుణం జరిగింది. పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతల్లే కడతేర్చింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

Tragedy : ఇద్దరు పిల్లలను ఉరి వేసి చంపిన తల్లి

Kill

Updated On : October 11, 2021 / 8:39 AM IST

mother killed two children : తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి లో దారుణం జరిగింది. పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతల్లే కడతేర్చింది.  తన ఇద్దరు పిల్లలను ఉరివేసి చంపేసింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆనంద్ నగర్ లో పూరేటి లక్ష్మీ అనూష (28) తన కుమార్తె చిన్మయి(8), కుమారుడు మోహిత్ (6)లతో కలిసి నివాసముంటోంది.

13 ఏళ్ల క్రితం తాడేపల్లిలో భర్త చనిపోవడంతో లక్ష్మీ అనూష రాజమండ్రికి వచ్చింది. బ్యూటీషియన్ గా పనిచేస్తూ ఓ వ్యక్తితో సహజీవనం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కుమార్తె చిన్మయి, కుమారుడు మోహిత్ లను లక్ష్మీ అనూష గత రాత్రి ఇంట్లో ఉరివేసి హత్య చేశారు.

Power Cut: కోత మొదలైంది.. కొందామన్నా కరెంట్ దొరకట్లే!

పిల్లలను ఉరివేసి చంపిన అనంతరం ప్రియుడికి ఫోన్ చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని చిన్నారుల మృతదేహాలను రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఇటీవల పిల్లల్ని కొట్టొద్దని అడ్డొచ్చిన తల్లి ముత్యం కనకదుర్గపై లక్ష్మీ అనూష దాడి చేసి, గాయపర్చారు. త్రి టౌన్ పోలీసులు లక్ష్మీ అనూషను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు.