చైనా – భారత్ ఉద్రిక్తతలు తగ్గేందుకు ఐదు సూత్రాలు

సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత్ – చైనా దేశాలు అంగీకారానికి వచ్చాయి. ఇందుకు ఐదు అంశాల ప్రణాళికను రూపొందించాయి. షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సులో భారత విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి భేటీ అయ్యారు.
ఉద్రిక్తతలు తగ్గించేందుకు నిర్ణయాలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాయి. సరిహద్దు వివాదాలపై తక్షణ నివారణ చర్యలపై ఏకాభిప్రాయం కుదిరింది.
1. విబేధాలను వివాదాలుగా మారకుండా చూడాలని తీర్మానం చేశాయి.
2. ఇరు దేశాల సరిహద్దులో వెంటనే సైనిక ఉపసంహరణ చేపట్టాలి.
3. ఇరు దేశాల మధ్య కుదిరిన అన్ని ఒప్పందాలకు, ప్రొటోకాల్స్ కు కట్టుబడి ఉండాలి.
4. సరిహద్దు వివాదాలపై WMCC కమిటీ సమావేశాలు కొనసాగించాలి.
5. ఇరు దేశాల మధ్య విశ్వాసం పెంపొందించే చర్యలను వేగవంతం చేయాలి.
ఇటీవలే చర్చలంటూనే డ్రాగన్ కంట్రీ కుతంత్రాలకు పాల్పడుతోంది. భారత భూభాగాలను ఆక్రమించేందుకు చైనా ఆర్మీ ప్రయత్నాలు చేస్తోంది. దీనిని ఇండియన్ ఆర్మీ ప్రతిఘటిస్తోంది.
https://10tv.in/what-kind-of-hindutva-is-this-sanjay-raut-on-nirmala-sitharamans-act-of-god-comment/
సైనిక కమాండర్ల స్థాయిలో సంప్రదింపులు జరుగుతుండగా.. మరోవైపు డ్రాగన్ భారత్‌ను దొంగదెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తోంది.
దాదాపు 45 సంవత్సరాల తర్వాత.. ఇండో-చైనా బోర్డర్‌లో తొలిసారి కాల్పులు చోటుచేసుకున్నాయి. జూన్ 15న గల్వాన్ వ్యాలీలో.. భారత్-చైనా సైనికుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగినప్పటికీ.. తుపాకులు మాత్రం వాడలేదు. ఈ ఘర్షణలో.. 20 మంది భారత వీరజవాన్లు అమరులయ్యారు.
చైనా వైపు కూడా భారీగా ప్రాణనష్టం జరిగినప్పటికీ.. డ్రాగన్ కంట్రీ ఆ విషయాన్ని బయటకు పొక్కనివ్వలేదు. తాజాగా.. చషుల్ సెక్టార్‌లో గాల్లోకి కాల్పులు జరిపి.. మళ్లీ ఇండియాపైనే అబద్ధపు ప్రచారానికి దిగింది చైనా.
డ్రాగన్ ఎత్తులను చిత్తు చేసేందుకు భారత సైన్యం యుద్ధ విమానాలతో అప్రమత్తమైంది. చైనా కదలికలను ముందుగానే పసిగట్టి దీటుగా ఎదుర్కొనేందుకు సన్నద్ధ మవుతోంది.. అలాగే సాధనా సంపత్తితో భారత్ రెడీగా ఉంది.. పాంగాంగ్ ప్రాంతంలో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్‌ఏ) పెద్దసంఖ్యలో దళాలను మోహరించింది.
భారీగా ఆటోమెటిక్ ఆయుధాలు, ఇనుప రాడ్లు, కర్రలు, చివరన పెద్ద కత్తిలాంటి అమరిక ఉన్న ఈటెలను చైనా సైనికులు చేతపట్టారు. వేట కొడవళ్లు బిగించిన కర్రలతో తూర్పు లద్ధాఖ్ సెక్టార్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి నిల్చొని ఉన్న ఫోటోలు లభించాయి. తాజా నిర్ణయాలకు చైనా కట్టుబడి ఉంటుందా ? లేదా ? అనేది చూడాలి.