India-China face off: భారత్-చైనా సైనికుల ఘర్షణపై రాజ్‌నాథ్ ఉన్నతస్థాయి సమావేశం.. పార్లమెంట్లో ప్రకటన చేసే ఛాన్స్

అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ సెక్టార్ లో భారత్-చైనా సైనికుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేసి చర్చించనున్నారు. ఆర్మీతో పాటు పలువురు అధికారులు ఇందులో పాల్గొననున్నారు. అనంతరం ఆయన దీనిపై పార్లమెంట్లో ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.

India-China face off: అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ సెక్టార్ లో భారత్-చైనా సైనికుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేసి చర్చించనున్నారు. ఆర్మీతో పాటు పలువురు అధికారులు ఇందులో పాల్గొననున్నారు. అనంతరం ఆయన దీనిపై పార్లమెంట్లో ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.

ఈ నెల 9న ఇరు దేశాల సైనికుల ఘర్షణ చోటుచేసుకున్న అంశం ఆలస్యంగా తెలిసింది. భారత్-చైనా సైనికుల ఘర్షణపై చర్చ కోసం ఇవాళ కాంగ్రెస్ ఎంపీ సయ్యద్ నజీర్ హుస్సేన్ స్వల్పకాలిక చర్చకు 176 నిబంధన కింద రాజ్యసభలో నోటీసు ఇచ్చారు. అలాగే, లోక్ సభలో కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ వాయిదా తీర్మానం ఇచ్చారు.

సరిహద్దుల వద్ద చోటు చేసుకుంటున్న పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం ఎందుకు వివరాలు తెలపడం లేదని ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమయ్యాయి. అంతేగాక, భారత్-చైనా సైనికుల ఘర్షణపై పార్లమెంటు ప్రాంగణం వద్ద ప్రతిపక్షాలు నిరసన తెలపనున్నట్లు తెలుస్తోంది.

అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ సెక్టార్ లో తాజాగా భారత్-చైనా సైనికుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ 2020లో గల్వాన్ లో జరిగిన ఘర్షణను గుర్తు చేస్తోంది. తాజాగా చోటుచేసుకున్న ఘర్షణపై పూర్తి వివరాలు ఇప్పటివరకు తెలియరాలేదు.

Father collapses: మెహందీ వేడుకలో పెళ్లికూతురి తండ్రి మృతి.. వధువుకి చెప్పకుండా వివాహం

ట్రెండింగ్ వార్తలు