Father collapses: మెహందీ వేడుకలో పెళ్లికూతురి తండ్రి మృతి.. వధువుకి చెప్పకుండా వివాహం

పెళ్లి ముహూర్తం దగ్గరపడడంతో పెళ్లికూతురు, పెళ్లికొడుకు బంధు, మిత్రులు ఎంతో ఉత్సాహంగా గడుపుతున్నారు. పెళ్లికి ముందురోజు మెహందీ వేడుక జరుగుతోంది. ఇంతలో ఊహించని విషాదం. మెహందీ వేడుకలో డ్యాన్స్ చేస్తూ పెళ్లికూతురి తండ్రి గుండెపోటుతో మృతి చెందాడు. అయినప్పటికీ, వధువుకి ఈ విషయం చెప్పకుండా, పుట్టెడు దు:ఖాన్ని దిగమించుకుని పెళ్లి జరిపించారు పెళ్లికూతురి కుటుంబ సభ్యులు. ఈ విషాద ఘటన ఉత్తరాఖండ్ లోని అల్మోరాలో చోటుచేసుకుంది.

Father collapses: మెహందీ వేడుకలో పెళ్లికూతురి తండ్రి మృతి.. వధువుకి చెప్పకుండా వివాహం

Suspicious Death

Updated On : December 13, 2022 / 9:48 AM IST

Father collapses: పెళ్లి ముహూర్తం దగ్గరపడడంతో పెళ్లికూతురు, పెళ్లికొడుకు బంధు, మిత్రులు ఎంతో ఉత్సాహంగా గడుపుతున్నారు. పెళ్లికి ముందురోజు మెహందీ వేడుక జరుగుతోంది. ఇంతలో ఊహించని విషాదం. మెహందీ వేడుకలో డ్యాన్స్ చేస్తూ పెళ్లికూతురి తండ్రి గుండెపోటుతో మృతి చెందాడు. అయినప్పటికీ, వధువుకి ఈ విషయం చెప్పకుండా, పుట్టెడు దు:ఖాన్ని దిగమించుకుని పెళ్లి జరిపించారు పెళ్లికూతురి కుటుంబ సభ్యులు. ఈ విషాద ఘటన ఉత్తరాఖండ్ లోని అల్మోరాలో చోటుచేసుకుంది.

ఆ ప్రాంతానికి చెందని ఓ అమ్మాయికి ఓ యువకుడితో పెళ్లి నిశ్చయమైంది. నిన్న పెళ్లి జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మొన్న రాత్రి మెహందీ వేడుక నిర్వహించారు. తన కూతురి పెళ్లి కాబోతుందన్న ఆనందంతో వధువు తండ్రి డ్యాన్సు చేస్తూ సంతోషంగా గడుపుతున్నాడు. ఇంతలో ఆయనకు ఛాతీలో నొప్పి వచ్చినట్లయింది. ఒక్కసారిగా కుప్పకూలాడు.

అతడిని బంధువులు ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతడు గుండెపోటుతో మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. అతడి మరణవార్తను వధువుకి కుటుంబ సభ్యులు చెప్పలేదు. అతడికి ఆసుపత్రిలో చికిత్స అందుతోందని, పెళ్లి వేడుక పూర్తి చేద్దామని అన్నారు. వధువు మేనమామ ఆమె తండ్రి స్థానంలో కూర్చొని కన్యాదానం ప్రక్రియను కొనసాగించాడు.

FIFA World Cup Journalist Died : ఫుట్ బాల్ మ్యాచ్ లైవ్ ఇస్తూ ప్రాణాలు విడిచిన మరో జర్నలిస్టు