Ladakh: చైనా సరిహద్దులో 26 పెట్రోలింగ్ పాయింట్లను కోల్పోయామట!

అయితే 26 పాయింట్లలోకి మన బలగాలు వెళ్లలేకపోతున్నట్లు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో లేహ్ ఎస్పీ పీ.డీ నిత్య పేర్కొన్నారు. ఈ నివేదికను ఆమె గతవారం ఢిల్లీలో జరిగిన పోలీస్ సదస్సులో కేంద్రానికి సమర్పించారు. చైనా ఏకపక్షంగా సరిహద్దులను మార్చేందుకు యత్నిస్తోందని భారత్ నెలరోజులకే ఈ నివేదిక రావడం గమనార్హం.

Ladakh: చైనా సరిహద్దైన తూర్పు లద్ధాఖ్ ప్రాంతంలో ఉన్న 65 పెట్రోలింగ్ పాయింట్లలో 26 పెట్రోలింగ్ పాయింట్లు కోల్పోయినట్లు సీనియర్ పోలీసు అధికారి ఒకరు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. వాస్తవానికి అన్ని పాయింట్లలో క్రమం తప్పుకుండా పెట్రోలింగ్ నిర్వహించాలని, అయితే 26 పాయింట్లలోకి మన బలగాలు వెళ్లలేకపోతున్నట్లు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో లేహ్ ఎస్పీ పీ.డీ నిత్య పేర్కొన్నారు. ఈ నివేదికను ఆమె గతవారం ఢిల్లీలో జరిగిన పోలీస్ సదస్సులో కేంద్రానికి సమర్పించారు. చైనా ఏకపక్షంగా సరిహద్దులను మార్చేందుకు యత్నిస్తోందని భారత్ నెలరోజులకే ఈ నివేదిక రావడం గమనార్హం.

Sushma Swaraj: సుష్మా స్వరాజ్‭పై అమెరికా మాజీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

పెట్రోలింగ్ నిర్వహించలేని ప్రాంతాలను చైనా ఆక్రమించుకోవాలని చూస్తోందని ఆ నివేదికలో పేర్కొన్నారు. అటువంటి ప్రాంతాల్లో బఫర్ జోన్లను సృష్టించి సరిహద్దును వెనక్కి నెడుతోందని పేర్కొన్నారు. ‘‘ఉద్రిక్తలను చల్లార్చేందుకు చేపట్టిన చర్చల్లో ఏర్పాటు చేసే బఫర్ జోన్లను అవకాశంగా మలుచుకొంటోంది. ఇక్కడ ఎత్తైన శిఖరాలపై కెమెరాలను అమర్చి భారత్ దళాల కదలికలను పసిగడుతోంది. బఫర్ జోన్‭లోకి మన సాయుధ బలగాలు ప్రవేశించిన వెంటనే అభ్యంతరం చెబుతోంది. ఆ ప్రదేశం తమ భూభాగంగా చైనా వాదిస్తోంది. ఆ తర్వాత మరింత బఫర్ జోన్ ఏర్పాటు పేరిట భారత్ ను వెనక్కి నెడుతోంది’’ అని ఆ నివేదికలో పేర్కొన్నారు.

Deccan Mall Demolition : రేపటి నుంచి డెక్కన్ మాల్ కూల్చివేత పనులు.. రూ.33 లక్షలకు టెండర్

ట్రెండింగ్ వార్తలు