Deccan Mall Demolition : రేపటి నుంచి డెక్కన్ మాల్ కూల్చివేత పనులు.. రూ.33 లక్షలకు టెండర్

సికింద్రాబాద్ రాంగోపాల్ పేటలో అగ్నిప్రమాదానికి గురైన డెక్కన్ మాల్ బిల్డింగ్ కూల్చివేత పనులకు ముహూర్తం ఖరారైంది. రేపటి(జనవరి 26) నుంచి బిల్డింగ్ కూల్చివేత పనులు ప్రారంభించనున్నారు. ఎస్ కే మల్లు కంపెనీకి కూల్చివేత పనులు అప్పగించారు. టెండర్ దక్కించుకున్న కంపెనీయే కూల్చివేత పనులతో పాటు వ్యర్థాలను తొలగించాలని ఒప్పందం చేసుకున్నారు.

Deccan Mall Demolition : రేపటి నుంచి డెక్కన్ మాల్ కూల్చివేత పనులు.. రూ.33 లక్షలకు టెండర్

Deccan Mall Demolition : సికింద్రాబాద్ రాంగోపాల్ పేటలో అగ్నిప్రమాదానికి గురైన డెక్కన్ మాల్ బిల్డింగ్ కూల్చివేత పనులకు ముహూర్తం ఖరారైంది. రేపటి(జనవరి 26) నుంచి బిల్డింగ్ కూల్చివేత పనులు ప్రారంభించనున్నారు. ఎస్ కే మల్లు కంపెనీకి కూల్చివేత పనులు అప్పగించారు. టెండర్ దక్కించుకున్న కంపెనీయే కూల్చివేత పనులతో పాటు వ్యర్థాలను తొలగించాలని ఒప్పందం చేసుకున్నారు.

మొత్తం 1890 చదరపు అడుగుల్లో ఉన్న కమర్షియల్ బిల్డింగ్ నిర్మాణం కూల్చివేతకు ఇప్పటికే టెండర్లు ఆహ్వానించారు. ఎస్ కే మల్లు కంపెనీ.. కూల్చివేత పనుల టెండర్ ను దక్కించుకుంది. ఈ నిర్మాణం కూల్చడానికి రూ.33 లక్షల 86వేల 268 ధర నిర్ణయించారు. 38.14 శాతం తక్కువ ఖర్చుతో పని చేసేందుకు ఎస్ కే మల్లు కంపెనీ ముందుకొచ్చింది. బిల్డింగ్ కూల్చివేతలో 20వేల మెట్రిక్ టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అవుతాయని అంచనా వేశారు.

Also Read..Hyderabad Illegal Constructions : బాబోయ్.. హైదరాబాద్‌లో లక్షకు పైనే అక్రమ నిర్మాణాలు, అధికారులు ఇప్పటికైనా కళ్లు తెరుస్తారా?

అగ్నిప్రమాదంలో డెక్కన్ మాల్ బిల్డింగ్ పూర్తిగా కాలిపోయింది. భవనం తీవ్రంగా దెబ్బతింది. బిల్డింగ్ ఏ క్షణమైనా కూలిపోయే ప్రమాదం ఉందని, ఆ బిల్డింగ్ దగ్గరికి ఎవరూ వెళ్లొద్దని అధికారులు హెచ్చరిక నోటీసు కూడా అంటించారు. ఈ క్రమంలో బిల్డింగ్ ను కూల్చివేయాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

అధునాతన యంత్రాలతో బిల్డింగ్ కూల్చివేయడానికి కాంట్రాక్టు ఏజెన్సీలను ఆహ్వానిస్తూ టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది జీహెచ్ఎంసీ. రేపటి నుంచి కూల్చివేత పనులు ప్రారంభిస్తామని టెండర్ దక్కించుకున్న సంస్థ ప్రభుత్వానికి చెప్పింది. కూల్చివేతకు అవసరమైన యంత్రాలు, పరికరాల తరలింపు పనులు చేపట్టాలని అధికారులు తెలిపారు.

Also Read..Secunderabad Fire Accident : సికింద్రాబాద్ అగ్నిప్రమాద ఘటన.. ఆ బిల్డింగ్‌లో ఒక అస్థిపంజరం లభ్యం

కూల్చివేతకు అవసరమైన యంత్రాలు, పరికరాలు, సేఫ్టీ సామగ్రి అన్నీ కాంట్రాక్ట్ ఏజెన్సీనే తెచ్చుకోవాల్సి ఉంటుంది. కూల్చివేత సందర్భంగా మళ్లీ ఏదైనా ప్రమాదం జరిగితే కాంట్రాక్ట్ చట్టాల ప్రకారం.. ఆ నష్ట పరిహార బాధ్యత కూడా ఏజెన్సీకే ఉంటుందని జీహెచ్‌ఎంసీ అధికారులు చెప్పారు. చుట్టుపక్కల ప్రజలకు నష్టం కలగకుండా, దుమ్ము, శబ్దం తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టాలని తెలిపింది. కూల్చాల్సిన భవనానికి కరెంటు, వాటర్, శానిటరీ కనెక్షన్లను తొలగించాలంది. వ్యర్థ పదార్థాలను కూడా ఏజెన్సీయే రీసైక్లింగ్‌ ప్లాంట్‌కు తరలించాల్సి ఉంది.

సికింద్రాబాద్ రాంగోపాల్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో డెక్కన్ స్పోర్ట్స్ వేర్ మాల్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. ఆరంతస్తుల డెక్కన్ స్పోర్ట్స్ వేర్ భవనంలో 10 గంటలకు పైగా మంటలు ఎగసిపడ్డాయి. మూడు వైపుల నుంచి ఫైరింజన్లను మోహరించి మంటలు ఆర్పేశారు. అగ్నికీలలను అదుపులోకి తెచ్చేందుకు చాలా శ్రమించాల్సి వచ్చింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

రాంగోపాల్ పేట మినిస్టర్‌ రోడ్డులో ఉన్న ఆరు అంతస్తుల డెక్కన్ మాల్ భవనం అగ్నికి ఆహుతైంది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రెండు సెల్లార్లతో కూడిన జి+5 భవనంలోని డెక్కన్‌ స్పోర్ట్స్‌ నిట్‌వేర్‌ మాల్‌లో జనవరి 19 ఉదయం 10.30 గంటలకు అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.