India Corona Cases : దేశంలో కొత్తగా 1190 కరోనా కేసులు.. 1375 మరణాలు

దేశంలో కొత్తగా 1,190 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,46,55,828కి చేరింది. ప్రస్తుతం దేశంలో 16,243 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో కరోనా బారిన పడి 1,375 మంది మృతి చెందారు.

india corona cases

India Corona Cases : భారత్ లో కరోనా వైరస్‌ వ్యాప్తి అదుపులోనే ఉంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు రెండు వేల లోపే నమోదవుతున్నాయి. ఇదే సమయంలో మరణాల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా దేశంలో కొత్తగా 1,190 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,46,55,828కి చేరింది. ప్రస్తుతం దేశంలో 16,243 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో కరోనా బారిన పడి 1,375 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు మృతుల సంఖ్య 5,30,452కి చేరినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

Britain Lab Deadly Virus : బ్రిటన్‌ ల్యాబ్‌లో కరోనా కన్నా ఎక్కువ ప్రాణాంతక వైరస్.. సృష్టించిన యూకే శాస్త్రవేత్తలు

మొత్తం కేసుల్లో 0.04 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని పేర్కొంది. రికవరీ రేటు 98. 78శాతం, మరణాలు 1.18 శాతంగా ఉన్నాయని వెల్లడించింది. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 219.66 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్లు తెలిపింది.