Britain Lab Deadly Virus : బ్రిటన్‌ ల్యాబ్‌లో కరోనా కన్నా ఎక్కువ ప్రాణాంతక వైరస్.. సృష్టించిన యూకే శాస్త్రవేత్తలు

చైనాలోని వుహాన్‌ ల్యాబ్‌లో కరోనా పుట్టిందని అన్ని దేశాలు అనుమానిస్తున్నాయి. ఇప్పుడు దాని కన్నా ఎక్కువ ప్రాణాంతక వైరస్‌ను బ్రిటన్‌ శాస్త్రవేత్తలు సృష్టించటం వివాదానికి తెర లేపింది. లండన్‌లోని ఇంపీరియల్‌ కాలేజ్‌ పరిశోధకులు ఈ వివాదాస్పద పరీక్షలు చేపట్టారు. దాదాపు 20 మంది శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలో పాల్గొంటున్నారు.

Britain Lab Deadly Virus : బ్రిటన్‌ ల్యాబ్‌లో కరోనా కన్నా ఎక్కువ ప్రాణాంతక వైరస్.. సృష్టించిన యూకే శాస్త్రవేత్తలు

deadly virus

Britain Lab Deadly Virus : చైనాలోని వుహాన్‌ ల్యాబ్‌లో కరోనా పుట్టిందని అన్ని దేశాలు అనుమానిస్తున్నాయి. ఇప్పుడు దాని కన్నా ఎక్కువ ప్రాణాంతక వైరస్‌ను బ్రిటన్‌ శాస్త్రవేత్తలు సృష్టించటం వివాదానికి తెర లేపింది. లండన్‌లోని ఇంపీరియల్‌ కాలేజ్‌ పరిశోధకులు ఈ వివాదాస్పద పరీక్షలు చేపట్టారు. దాదాపు 20 మంది శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలో పాల్గొంటున్నారు. అందులో యూకే ప్రభుత్వానికి చెందిన సైంటిఫిక్‌ అడ్వైజరీ గ్రూఫ్‌ ఎమర్జెన్సీస్‌ సభ్యురాలు, కాలేజీ వైరాలజిస్ట్‌ ప్రొఫెసర్‌ వెండీ బార్క్‌లే తదితరులు ఉన్నారు.

ఒమిక్రాన్‌ వేరియంట్‌ వైరస్‌ నుంచి స్పైక్స్‌ను తొలగించి, చైనాలో బయటపడ్డ కరోనా వైరస్‌లోకి జొప్పించారు. దాన్ని చిట్టెలుకల్లోకి ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ఆ ఎలుక పరిస్థితిని ల్యాబ్‌లో పరీక్షిస్తున్నారు. భవిష్యత్తులో రాబోయే వైరల్‌ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించుకొనే వ్యవస్థను తయారు చేయటానికి ఈ పరిశోధన ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు వాదిస్తున్నారు. ఈ వైరస్‌తో దాని తీవ్రతను ఢీకొట్టేలా వ్యాక్సిన్లు, చికిత్సలు అభివృద్ధి చేయవచ్చని వివరిస్తున్నారు.
బ్రిటిష్‌ నిబంధనల మేరకే ఈ పరీక్షలు చేపట్టినట్లు యూనివర్సిటీ వెల్లడించింది.

COVID-19 UPDATE: దేశంలో కొత్తగా 1,326 కరోనా కేసులు నమోదు

అత్యంత సురక్షితమైన వాతావరణంలోనే పరిశోధన జరుగుతుందని వివరించింది. అయితే, ఈ పరిశోధనపై వైద్య నిపుణులు, విమర్శకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మ్యుటెంట్‌ వైరస్‌ బయటికి వస్తే పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి పిచ్చి పరిశోధనలకు ప్రభుత్వాలు అనుమతి ఇవ్వకూడదని డిమాండ్‌ చేస్తున్నారు. ఇలాంటి ప్రయోగాలు ఒక్క కొవిడ్‌తోనే ఆపేస్తున్నారా? లేక వేరే వైరస్‌లపైనా చేస్తున్నారా? అని అనుమానం వ్యక్తం చేశారు.