COVID-19 UPDATE: దేశంలో కొత్తగా 1,326 కరోనా కేసులు నమోదు

దేశంలో కొత్తగా 1,326 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న కరోనా నుంచి 1,723 మంది కోలుకున్నారని వివరించింది. దీంతో దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు కోలుకున్న కేసుల సంఖ్య 4,41,06,656కి చేరిందని తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.59 శాతంగా, వారాంతపు పాజిటివిటీ రేటు 1.08 శాతంగా ఉన్నట్లు చెప్పింది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 17,912గా ఉందని వివరించింది.

COVID-19 UPDATE: దేశంలో కొత్తగా 1,326 కరోనా కేసులు నమోదు

india corona cases

COVID-19 UPDATE: దేశంలో కొత్తగా 1,326 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న కరోనా నుంచి 1,723 మంది కోలుకున్నారని వివరించింది. దీంతో దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు కోలుకున్న కేసుల సంఖ్య 4,41,06,656కి చేరిందని తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.59 శాతంగా, వారాంతపు పాజిటివిటీ రేటు 1.08 శాతంగా ఉన్నట్లు చెప్పింది.

దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 17,912గా ఉందని వివరించింది. యాక్టివ్ కేసుల రేటు 0.04 శాతంగా ఉందని చెప్పింది. ప్రస్తుతం రికవరీ రేటు 98.78 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. దేశంలో ఇప్పటివరకు 219.63 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు వేసినట్లు చెప్పింది.

వాటిలో రెండో డోసుల సంఖ్య 95.02 కోట్లు, ప్రికాషన్ డోసుల సంఖ్య 22.08 కోట్లు ఉన్నట్లు తెలిపింది. నిన్న 25,433 కరోనా వ్యాక్సిన్ డోసులు వేసినట్లు పేర్కొంది. దేశంలో ఇప్పటివరకు 90.09 కోట్ల కరోనా పరీక్షలు చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న 83,167 కరోనా పరీక్షలు చేసినట్లు వివరించింది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..