India Corona Update : దేశంలో 30 వేలకు చేరువైన రోజువారీ కరోనా కేసులు
దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. నాలుగు రోజుల క్రితం పదివేలకు దిగువన నమోదైన రోజువారీ కేసులు.. క్రమంగా పెరుగుతున్నాయి.

India Corona
India Corona Update : దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. నాలుగు రోజుల క్రితం పదివేలకు దిగువన నమోదైన రోజువారీ కేసులు.. క్రమంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 27,553 కేసులు నమోదయ్యాయి. ఇక ఇదే సమయంలో ఈ మహమ్మారితో 284 మంది మరణించారు. తాజాగా నమోదైన కేసులతో కలుపుకొని దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,47,93,884 చేరింది.
చదవండి : Corona Virus : రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నా వదలని కరోనా
ఇప్పటివరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 4,81,770కు చేరింది. ఇక శనివారం కరోనా నుంచి 9,249 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,42,84,561కి చేరింది. ప్రస్తుతం దేశంలో 122801 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దేశంలో కరోనా రికవరీ రేటు 98.27 శాతంగా ఉంది. పాజిటివిటి రేటు 2.55 శాతానికి చేరుకుంది.
చదవండి : Corona Red Alert: మళ్లీ నియంత్రించలేనిదిగా మారుతోన్న కరోనా.. రెడ్ అలర్ట్?