Pakistan: పాకిస్థాన్ కు దిమ్మతిరిగే షాకిచ్చిన భారత్.. ఆ డ్యామ్ గేట్లు డౌన్.. అక్కడి ప్రాంతాలు ఎడారే..
పహల్గాం ఉగ్రదాడి తరువాత పాకిస్థాన్ కు గట్టి గుణపాఠం చెప్పేందుకు భారత్ అన్ని విధాల ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

Baglihar Dam
Pakistan: పహల్గాం ఉగ్రదాడి తరువాత పాకిస్థాన్ కు గట్టి గుణపాఠం చెప్పేందుకు భారత్ అన్ని విధాల ప్రయత్నాలు ముమ్మరం చేసింది. సైనిక చర్యతోపాటు పాకిస్థాన్ ఆర్థిక మూలాలపై గురిపెట్టిన భారత్.. అదేసమయంలో పాకిస్థాన్ కు మరో దిమ్మతిరిగే షాకిచ్చింది. ఇప్పటికే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపేసిన విషయం తెలిసిందే.. తాజాగా.. బాగ్‌లిహార్ డ్యామ్ నుంచి పాకిస్థాన్ కు నీటి సరఫరాను నిలిపివేసింది. డ్యామ్ స్లూయిస్ స్పిల్ వేపై ఉన్న గేట్లను కిందకు దించేశారు. మరోవైపు జీలమ్ నదిపై ఉన్న కిషన్ గంగా డ్యామ్ నుంచి నీటి ప్రవాహాలు వెళ్లకుండా చర్యలకు భారత్ సిద్ధమవుతోంది.
Also Read: Pakistan Military: భారత్‌తో యుద్ధం వస్తే 4 రోజుల్లోనే పాకిస్తాన్ ఖేల్ ఖతం..! కారణం ఏంటంటే..
బాగ్‌లిహార్ డ్యామ్ ను చినాబ్ నదిపై 2008లో నిర్మించారు. సింధు జలాల ఒప్పందం కింద పాకిస్థాన్ కు అత్యధిక వాటా నీళ్లు లభించిన నదుల్లో చినాబ్ కూడా ఒకటి. ఈ డ్యామ్ పొడవు దాదాపు 145 మీటర్లు. బాగ్‌లిహార్ డ్యామ్ పై హైడ్రో పవర్ జనరేషన్ తోపాటు పంజాబ్ ప్రావిన్స్, తదితర ప్రాంతాల్లో ఎక్కువగా పంట పొలాలు దీనిపై ఆధారపడి ఉన్నాయి. ఇదిలాఉంటే.. ఇటీవల జీలం నది వరద ప్రవాహం పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంత ప్రజలను భయాందోళనకు గురిచేసింది. గతవారం ముజఫరాబాద్ సమీపంలోని హట్టియాన్ బాలా ప్రాంతంలో నీటి మట్టం ఒక్కసారిగా పెరిగిపోవడంతో ఎమర్జెన్సీ ప్రకటించాల్సి వచ్చింది. జీలం నది అనంతనాగ్ జిల్లా మీదుగా ప్రవహించి చకోథి వద్ద పీవోకేలోకి చేరుతుంది. ఈ పరిణామాలన్నీ చూస్తే ఉగ్రదాడికి కౌంటర్ గా నీటి ఆయుధాన్ని బారత్ సమర్థవంతంగా వినియోగిస్తోందని చెప్పొచ్చు.
పహల్గాం ఉగ్రదాడి తరువాత భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. సిందూ నీటి ఒప్పందాన్ని నిలిపివేయంతో పాటు వీసాల రద్దు, పాకిస్తానీయులను వెనక్కి పంపించడం,దౌత్య సిబ్బందిని తగ్గించడం, అటారి సరిహద్దు మూసివేత, పాక్ కు సంబందించిన సామాజిక మాధ్యమాలు నిషేదం, వ్యాపార ఆంక్షలు విధించిన భారత్.. పాకిస్థాన్ పై నీటి యుద్ధాన్ని కూడా ముమ్మరం చేస్తోంది.