IAFలో తొలి మహిళా ఫ్లైట్ ఇంజనీర్ గా హినా జైశ్వాల్

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో మొదటి మహిళా ఫ్లైట్ ఇంజనీర్ గా ఫ్లెట్ లెఫ్టినెంట్ హినా జైశ్వాల్ చరిత్ర సృష్టించింది.భారత వాయుసేనకు చెందిన ఆపరేషనల్ హెలికాఫ్టర్ యూనిట్లలో ఫ్లైట్ ఇంజనీర్‌గా హినా విధులు నిర్వహించనుంది.అత్యంత శీతల ప్రాంతమైన సియాచిన్ గ్లేసియర్ నుంచి సున్నితమైన పలు ప్రాంతాల్లో ఒత్తిడితో కూడిన వాతావరణంలో ఫ్లైట్ ఇంజనీర్‌గా ఆమె సేవలు అందించాల్సి ఉంటుంది.భారత వాయుసేనలో చేరడం ద్వారా తన చిరకాల స్వప్నం నెరవేరిందని హినా తెలిపింది.
చండీఘడ్ కి చెందిన హినా పంజాబ్ యూనివర్శిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఇంజరీంగ్ లో డిగ్రీ పట్టా పొందింది. ఫ్లైట్ ఙంజనీర్ గా ఆరు నెలలుగా ఆమె కఠోర శిక్షణ పొందారు. సైనికుల యూనిఫాం ధరించి ఏవియేటర్‌గా ఆకాశంలో విహరించాలని చిన్నతనం నుంచి తనకు ఆసక్తి ఉండేదని హినా జైశ్వాల్ తెలిపారు.