Operation Sindoor: భారత ఆర్మీ గురిపెట్టి కొడితే.. దెబ్బకు ధ్వంసమైన ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్‌లు.. వీడియో వైరల్

భారత ఆర్మీ ఉగ్రవాదులకు స్థావరంగా మారిన సరిహద్దు ప్రాంతాల్లోని లాంచ్ ప్యాడ్ లపై మెరుపుదాడులు చేసింది.

Indian Army

Operation Sindoor: భారత్, పాకిస్థాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో జమ్మూసరిహద్దు ప్రాంతంలో భారత సైన్యం మరో కీలక ముందడుగు వేసింది. పాకిస్థాన్ వైపు నుంచి ఉగ్రవాదుల చొరబాట్లు, ముఖ్యంగా ట్యూబ్ – లాంచెడ్ డ్రోన్లు ప్రయోగానికి వినియోగించిన పాకిస్తానీ పోస్టులు, ఉగ్రవాద లాంచ్ ప్యాడ్ లను భారత సైన్యం సమర్ధవంతంగా ధ్వంసం చేసింది.

Also Read: భార‌త్‌పైకి ఫతాహ్-2 మిసైల్‌ను ప్రయోగించిన పాక్.. తుక్కుతుక్కు చేసిన రక్షణ వ్యవస్థ.. ఫతాహ్-2 మిసైల్‌ అంటే ఏమిటి..? దాని టార్గెట్ పరిధి ఎంతంటే..

గత కొద్దిరోజులుగా సరిహద్దుల్లో పాకిస్థాన్ సైన్యం, ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలు పెరిగాయి. జమ్మూ సమీపంలోని సరిహద్దు ప్రాంతాల నుంచి ట్యాబ్ – లాంచెడ్ డ్రోన్లను ఉపయోగించి మనదేశ భూభాగంలోకి గూఢచర్యం, దాడులకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు నిఘావర్గాల ద్వారా సమాచారం రావడంతో.. భారత ఆర్మీ దృష్టిసారించింది. ఉగ్రవాదులకు స్థావరంగా మారిన సరిహద్దు ప్రాంతాల్లోని లాంచ్ ప్యాడ్ లపై గురిపెట్టి మెరుపుదాడులు చేసింది. దీంతో లాండ్ ప్యాడ్ లు ధ్వంసమయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియోను ఇండియన్ ఆర్మీ ట్విటర్ ఖాతాలో పోస్టు చేసింది. ఇప్పుడు లాంచ్‌ప్యాడ్‌ను ధ్వంసం చేయడంతో వారి మౌలిక సదుపాయాలు, సామర్థ్యాలకు భారీ దెబ్బ తగిలిందని పోస్టులో భారత ఆర్మీ తెలిపింది.