భారత్‌పైకి ఫతాహ్-2 మిసైల్‌ను ప్రయోగించిన పాక్.. తుక్కుతుక్కు చేసిన రక్షణ వ్యవస్థ.. ఫతాహ్-2 మిసైల్ అంటే ఏమిటి..? దాని టార్గెట్ పరిధి ఎంతంటే..
ఢిల్లీ లక్ష్యంగా పాకిస్థాన్ అత్యాధునిక ఫతాహ్-2 మిసైల్‌ను ప్రయోగించింది. అయితే, భారత రక్షణ వ్యవస్థ హర్యానాలోని సిర్సా మీదుగా ఈ మిసైల్ ను అడ్డగించి కూల్చేసింది.

fatah 2 missile
India Pakistan War: పాకిస్థాన్ బుద్ధి మారలేదు. తొలిరోజు భారత్ పై విరుకుపడేందుకు విఫలయత్నం చేసిన చావుదెబ్బ తిన్న పాకిస్థాన్.. రెండోరోజూ సరిహద్దు ప్రాంతాలపై దాడులకు ప్రయత్నించింది. పాక్ దాడులను భారత సైన్యం సమర్ధంగా తిప్పికొట్టింది. క్షిపణులు, డ్రోన్లను ఎక్కడికక్కడ కూల్చేసింది. అయితే, పాకిస్థాన్ ‘ఆపరేషన్ బున్యాన్ ఉన్ మర్సూస్’’ కింద ఢిల్లీని టార్గెట్ చేసింది. ఢిల్లీ లక్ష్యంగా ఫతాహ్-2 మిసైల్‌ను ప్రయోగించింది. అయితే, భారత రక్షణ వ్యవస్థ హర్యానాలోని సిర్సా మీదుగా ఈ మిసైల్ ను అడ్డగించి కూల్చేసింది. మరోవైపు ఉత్తర భారతదేశంలో ఉన్న వ్యూహాత్మక భారత సైనిక స్థావరంపైకి ఫతాహ్- 1 మిసైల్ ను పాక్ ప్రయోగించింది.. ఆ మిసైల్ ను ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అడ్డుకొని కూల్చేసింది.
ఫతాహ్-2 మిసైల్ అంటే ఏమిటి..?
ఫతాహ్-2 మిసైల్ పాకిస్థాన్ అభివృద్ధి చేసిన ఒక గైడెడ్ మల్టీఫుల్ రాకెట్ లాంచర్ సిస్టమ్. ఇది పాకిస్థాన్ లో శక్తివంతమైన మిసైళ్లలో ఒకటి. మొదటిసారిగా 2021 డిసెంబర్ లో పాకిస్థాన్ సైన్యం అధికారికంగా దీన్ని పరీక్షించింది. ఈ మిసైల్ కు 250 నుండి 400 కిలో మీటర్ల పరిధి వరకు అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం దీనికి ఉంది. ఇది అధునాతన ఏవియానిక్స్, నావిగేషన్ సిస్టమ్, ప్రత్యేకమైన విమాన పథంలో అమర్చబడి ఉంది. ఇది 150 కిలోమీటర్ల పరిధి లక్ష్యాలను ఛేదించే సత్తాకలిగిన ఫతాహ్-1 మిసైల్ కు అప్ గ్రేడెడ్. ఇది గైడెడ్ స్మాల్-రేంజ్ బాలిస్టిక్ క్షిపణి అంటారు. 10 మీటర్ల కంటే తక్కువ వృత్తాకార దోష సంభావ్యత (CEP)తో ఖచ్చితమైన లక్ష్యాన్ని ఛేదిస్తుంది. ఈ క్షిపణి S-400 వైమానిక రక్షణ వ్యవస్థలను దాటుకొని తన లక్ష్యాలను ఛేదిస్తుందని చెబుతారు.
Also Read: Pakistan Drone Attack: పాకిస్తాన్ బరితెగింపు.. డ్రోన్స్‌తో జనంపై దాడి..
అధునాతన పాకిస్థాన్ మిసైల్ ఫతేహ్-2..
రష్యా నుంచి భారత్ తెప్పించిన S-400 వైమానిక రక్షణ వ్యవస్థను ఫతాహ్-2 మిసైల్ సవాల్ చేస్తుందని పాకిస్థాన్ భావించింది. అయితే, అత్యాధునిక మిసైల్ గా భావిస్తున్న ఫతాహ్-2 ను భారత రక్షణ వ్యవస్థ సమర్ధవంతంగా తిప్పికొట్టింది. తద్వారా పాకిస్థాన్ కు దిమ్మతిరిగే షాకిచ్చినట్లయింది.
Reportedly the debris from missile intercepted last night above Sirsa, Haryana. People are talking about how those sleeping in open saw a huge blast in air.
Video via : @Sahilrukhaya7 #IndiaPakistanWar pic.twitter.com/buVs9CylqP
— Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) May 10, 2025