Pakistan Drone Attack: పాకిస్తాన్ బరితెగింపు.. డ్రోన్స్‌తో జనంపై దాడి..
గాయపడ్డ వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Pakistan Drone Attack: పాకిస్తాన్ బరితెగించింది. మరోసారి దాడులకు తెగబడింది. ఈసారి పాక్ తీరు శ్రుతి మించింది. డ్రోన్లతో పౌరులపై దాడికి దిగింది పాక్. పంజాబ్ లోని ఫిరోజ్ పూర్ లో డ్రోన్ అటాక్ చేసింది. నివాసాలపై డ్రోన్లతో దాడికి పాల్పడింది. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డవారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
పాకిస్తాన్ మళ్లీ రెచ్చిపోయింది. వరుసగా రెండోరోజు భారత్ పై దాడికి యత్నించింది. జమ్ము, సాంబా, పఠాన్ కోట్, నౌగాంలో డ్రోన్లతో దాడికి పాక్ ప్రయత్నం చేసింది. పూంచ్, ఫిరోజ్ పూర్, అమృత్ సర్, జైసల్మేర్ లో డ్రోన్లతో అటాక్ చేసేందుకు పాక్ ట్రై చేసింది. పాక్ డ్రోన్లను భారత సైన్యం కూల్చేసింది. జైసల్మేర్ లోని పోఖ్రాన్ దగ్గర పాక్ డ్రోన్ ని కూల్చేసింది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తో పాక్ డ్రోన్లను భారత్ నిర్వీర్యం చేసింది. జమ్ముకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ లక్ష్యంగా పాక్ సైన్యం దాడులు చేస్తోంది. పేలుళ్ల శబ్దాలు వినిపిస్తున్నాయని జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా అన్నారు. ఎల్ వోసీ వెంబడి వార్ సైరన్ ను మోగించింది ఇండియన్ ఆర్మీ.
జమ్ముకశ్మీర్, సాంబా, యురి, జైసల్మేర్ లో బ్లాకౌట్ ప్రకటించారు. రాజస్థాన్ లోని జైసల్మేర్ లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. హరియానాలోని అంబాలా, పంచకులలో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. పంజాబ్ లోని ఫిరోజ్ పూర్ లోనూ విద్యుత్ సరఫరా ఆపేశారు. జమ్ముకశ్మీర్, రాజస్థాన్, పంజాబ్ బోర్డర్ లో హైఅలర్ట్ ప్రకటించారు.
Also Read: టర్కీ డ్రోన్లతో పాక్ దాడులు చేసింది.. అన్నింటిని కూల్చేశాం- కల్నల్ సోఫియా ఖురేషి