Jammu kashmir: ఉగ్ర కుట్రను భగ్నం చేసిన భారత బలగాలు

జమ్ము‌కశ్మీర్‌లోని యూరి సెక్టార్ సరిహద్దు ద్వారా భారత్‌లోకి చొరబడి ఉగ్రవాదులు దాడికి ప్లాన్ చేశారు. వారి కుట్రలను భారత్ భద్రతా బలగాలు గుట్టురట్టు చేశాయి

Jammu kashmir: జమ్ము‌కశ్మీర్‌లోని యూరి సెక్టార్ సరిహద్దు ద్వారా భారత్‌లోకి చొరబడి ఉగ్రవాదులు దాడికి ప్లాన్ చేశారు. వారి కుట్రలను భారత్ భద్రతా బలగాలు గుట్టురట్టు చేశాయి. ఆర్మీ, జమ్మూకశ్మీర్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ ద్వారా భారీగా మందుగుండు సామాగ్రి, ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాతో సంబంధమున్న కొందరు వ్యక్తులు భారత్ లోకి ఆయుధాలను చేరవేసేందుకు ప్రయత్నించారు.

Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్‌ ప్రాంతంలో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం

సరిహద్దు ప్రాంతాల ప్రజల పక్కా సమాచారంతో పోలీసులు, ఆర్మీ జవాన్లు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలో జమ్మూకశ్మీర్‌లోని హత్‌లంగా గ్రామ సమీపంలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆర్మీ అధికారులు వెల్లడించారు. అయితే ఇందుకు కారణమైన వారిపై ఇప్పటి ఎలాంటి కేసు నమోదు కాలేదని తెలుస్తోంది.

 

ఆర్మీ, జమ్ము కశ్మీర్ పోలీసులు నిర్వహించిన సంయుక్త ఆపరేషన్‌లో 8ఏకే రైఫిల్స్‌తో పాటు 12 గన్‌లు, పెద్ద మొత్తంలో మందుగుండు సామాగ్రి, ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు