Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్‌ ప్రాంతంలో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్ షోపియాన్ జిల్లా ముంజ్ మార్గ్ ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య మంగళవారం ఉదయం ఎన్ కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కర్‌కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ విషయాన్ని కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు.

Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్‌ ప్రాంతంలో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం

Jammu Kashmir

Updated On : December 20, 2022 / 8:45 AM IST

Jammu Kashmir: జమ్మూ కశ్మీర్‌ మరోసారి ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు, ఉగ్రవాదులు మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్లు తెలిసింది. వారి నుంచి ఏకే -47 గన్స్‌తో సహా ఇతర ఆయుధాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. జమ్మూ కశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలోని ముంజ్ మార్గ్ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. మరికొందరు ఉగ్రవాదులు ఈ ప్రాంతంలో రహస్య ప్రాంతాల్లో దాగిఉన్నట్లు భద్రతాబలగాలు భావిస్తున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.

Jammu Kashmir: పాకిస్తాన్‭తో శాంతి చర్చలపై అమిత్ షా ఏమన్నారంటే?

ఎన్‍కౌంటర్ విషయంపై కశ్మీర్ ఏడీజీపీ మాట్లాడుతూ.. లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్లు తెలిపారు. ఇద్దరు ఉగ్రవాదులు షోపియాన్ లోని లతీఫ్ లోన్ ప్రాంతానికి చెందిన వారని తేల్చారు. భద్రతా బలగాల కాల్పుల్లో హతమైన ఉగ్రవాదుల్లో.. కశ్మీర్ పండిట్ పురాన్ కృష్ణభట్, అనంతనాగర్ కు చెందిన ఉమర్ నజీర్, నేపాల్ కు చెందిన టిల్ బహదూర్ థాపా హత్యకు కారణమైనవారినిగా భావిస్తున్నారు. అంతేకాదు.. నేపాల్ కు చెందిన థాపాను హతమార్చారు. వీరి వద్ద ఏకే-47 గన్స్, రెండు పిస్టల్స్ స్వాధీనం చేసుకున్నట్లు కశ్మీర్ ఏడీజీపీ తెలిపారు.

షోపియాన్ జిల్లాలోని ముంజ్ మార్గ్ ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కున్నట్లు భద్రతా దళాలకు సమాచారం అందింది. పోలీసులతో సహా భద్రతా దళాల బృందం ఆ ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం ఆపరేషన్ నిర్వహించింది. ఈ క్రమంలో వారిని హతమార్చారు. అయితే, మరికొందరు ఉగ్రవాదులు ఆ ప్రాంతంలో రహస్య ప్రదేశంలో ఉన్నట్లు అనుమానంతో.. భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని దిగ్బంధించి సెర్చ్ ఆపరేషన్ ను ముమ్మరం చేశాయి.