Vishwachand Kolla : అమెరికాలో బస్సు ఢీకొని తెలుగు ఎన్నారై మృతి

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విశ్వచంద్ కొల్లా తాకేడ ఫార్మాస్యూటికల్ కంపెనీలో ఉద్యోగి. మార్చి 28న బోస్టన్‌లోని లోగాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో విజిటింగ్ సంగీతకారుడిని పికప్ చేసుకోవడానికి అతను వెళ్లినప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది.

Vishwachand Kolla : అమెరికాలో బస్సు ఢీకొని తెలుగు ఎన్నారై మృతి

Vishwachand Kolla

Updated On : April 3, 2023 / 8:09 PM IST

Vishwachand Kolla : అమెరికాలో బస్సు ఢీకొని భారత సంతతి వ్యక్తి మృతి చెందారు. యుఎస్ ఎయిర్‌పోర్ట్‌లో వేచి ఉండగా భారత సంతతికి చెందిన డేటా అనలిస్ట్ విశ్వచంద్ కొల్లా బస్సు ఢీకొని మరణించాడు. 47 ఏళ్ల భారతీయ-అమెరికన్ డేటా అనలిస్ట్ విశ్వచంద్ కొల్లా బోస్టన్ లోని లోగాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మరణించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విశ్వచంద్ కొల్లా తాకేడ ఫార్మాస్యూటికల్ కంపెనీలో ఉద్యోగి. మార్చి 28న బోస్టన్‌లోని లోగాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో విజిటింగ్ సంగీతకారుడిని అతను పికప్ చేసుకోవడానికి వెళ్లినప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది.

విశ్వచంద్ కొల్లా సాయంత్రం 5 గంటలకు స్నేహితుడిని పికప్ చేసుకోవడానికి టెర్మినల్ B దిగువ స్థాయిలో ఉండగా అతన్ని ఒక బస్సు ఢీకొట్టిందని మసాచుసెట్స్ స్టేట్ పోలీసులు తెలిపారు.
డ్యూటీలో లేని నర్సు కొల్లాకు సహాయం చేయడానికి పరుగెత్తారుు. అయితే అతను సంఘటనా స్థలంలోనే మరణించారు. ట్రూపర్లు బస్సు డ్రైవర్, 54 ఏళ్ల మహిళను ఇంటర్వ్యూ చేసి, బస్సును తనిఖీ చేశారు. విచారణలో ఇప్పటివరకు ఆమెపై ఎలాంటి అభియోగాలు నమోదు కాలేదని నివేదిక పేర్కొంది.

Indian in America: అమెరికా పార్కులో కూర్చొన్న భారత సంతతి వ్యక్తి హత్య

ప్రయాణికులను వెంటనే బస్సు నుంచి దించి, వారి లగేజీని విమానాశ్రయంలోని మరో భాగానికి తరలించారు. లోగాన్ ఎయిర్‌పోర్ట్‌లో ఈ సాయంత్రం జరిగిన సంఘటనలో బాధితులైన ప్రతి ఒక్కరికీ తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని డార్ట్‌మౌత్ కోచ్ ఒక ప్రకటనలో తెలిపారు. తాము మరింత సమాచారాన్ని సేకరించేందుకు మసాచుసెట్స్ స్టేట్ పోలీస్, మాస్‌పోర్ట్‌తో కలిసి పని చేస్తున్నామని చెప్పారు. టకేడాలోని గ్లోబల్ కంపెనీ ఆంకాలజీ విభాగంలో కొల్లా పనిచేశారు.

అతని మరణవార్త విని చాలా బాధపడ్డట్లు టకేడా ఇండస్ట్రీస్ బోస్టన్.కామ్‌ ఒక ఇ-మెయిల్‌లో తెలియజేసింది.  ఈ క్లిష్ట సమయంలో విశ్వచంద్ కుటుంబం, స్నేహితులు, ప్రియమైనవారికి తమ హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తున్నట్లు తెలిపింది. ఈ సమయంలో తాము అతని కుటుంబానికి ఎలా సహాయపడగలమో పరిశీలిస్తామని పేర్కొన్నారు. ఇక కొల్లా బంధువులు gofundme పేజీని ఏర్పాటు చేశారు. కొల్లాకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నట్లు పేజీలో పేర్కొన్నారు.