World’s Top Leader: ప్రపంచంలోనే టాప్ లీడర్ గా భారత ప్రధాని

ఇక ఆ తర్వాత 65 శాతం మంది ప్రజలు ఇటలీ ప్రధాని డ్రాగీ నాయకత్వాన్ని సమర్ధించారు. 63 శాతంతో మెక్సికో అధ్యక్షుడు లోపేజ్ ఓబ్రడార్ మూడో స్థానంలో ఉన్నాడు, ఆస్ట్రేలియా ప్రధాని మారిసన్ నాయకత్వాన్ని 54 శాతం మంది ప్రజలు సమర్ధించారు దీంతో ఆయన నాలుగవ స్థానంలో నిలించారు.

World’s Top Leader: ప్రపంచ నాయకులపై సర్వే నిర్వహించే ‘మార్నింగ్‌ కన్సల్ట్‌’ సంస్థ తన సర్వే నివేదికను శుక్రవారం విడుదల చేసింది. ఈ నివేదికలో అత్యంత మంది నమ్ముతున్న నేతగా నరేంద్ర మోదీ మొదటి స్థానంలో నిలించారు. నరేంద్ర మోదీని 66 శాతం మంది ప్రజలు విశ్వసిస్తున్నట్లు సర్వేలో తేలింది.

2019తో పోల్చుకుంటే మోదీపై ప్రజలకు కొంతమేర నమ్మకం తగ్గినట్లుగా కనిపిస్తుంది. 2019లో మోదీని 82 శాతం మంది విశ్వసించగా, 2021 వచ్చే సరికి 66 శాతం మంది మోదీని నాయకత్వాన్ని ఇష్టపడుతున్నారు. 2019కి 2021 కి సుమారు 16 శాతం మంది తగ్గిన మోదీనే నంబర్ వన్ ప్రజామోదం ఉన్ననేతగా నిలిచారు.

ఇక ఆ తర్వాత 65 శాతం మంది ప్రజలు ఇటలీ ప్రధాని డ్రాగీ నాయకత్వాన్ని సమర్ధించారు. 63 శాతంతో మెక్సికో అధ్యక్షుడు లోపేజ్ ఓబ్రడార్ మూడో స్థానంలో ఉన్నాడు, ఆస్ట్రేలియా ప్రధాని మారిసన్ నాయకత్వాన్ని 54 శాతం మంది ప్రజలు సమర్ధించారు దీంతో ఆయన నాలుగవ స్థానంలో నిలించారు.

జెర్మనీ ఛాన్సలర్ మోర్కల్ 53 శాతంతో ఐదవ స్థానంలో ఉన్నారు. కాగా తాజాగా ఎన్నికైన అమెరికా ప్రధాని జో బైడెన్ టాప్ ఫైవ్ లో స్థానం దక్కించుకోలేక పోయారు. బైడెన్ 53 శాతంతో ఆరవ స్థానంలో నిలించారు.

ట్రెండింగ్ వార్తలు