Snake Bite : పాముకాటుతో మరణిస్తే .. రూ.4లక్షలు పరిహారం

పాము కాటుతో ఎవరైనా చనిపోతే ..వారి కుటుంబ సభ్యులు పరిహారం పొందవచ్చు. పరిహారం పొందాలంటే ఏమేమి చేయాలి..?

Snake Bite :  పాముకాటుతో మరణిస్తే .. రూ.4లక్షలు పరిహారం

Govt compensation for snake bite

Government compensation for snake bite : భారత్ లో వ్యాధులతో చనిపోయేవారి కంటే పాముకాటుతో ప్రాణాలు కోల్పోవారే ఎక్కువ. అలా గత 20 ఏళ్లలో 1.2 మిలియన్లకు పైగా ప్రజలు పాముకాటుకు గురై ప్రాణాలు కోల్పోయారని సర్వేలో తేలింది. భారతదేశంలో మొత్తం 276 రకాల పాములు ఉన్నాయి. వాటిలో 20 నుంచి 30 శాతం అత్యంత విషపూరితమైనవి. అలాంటి పాములు కాటేస్తే సరైన సమయంలో వైద్యం అందకపోతే చనిపోవడం ఖాయం. పాముకాటుతో చనిపోవడాన్ని భారతదేశంలోని లపు రాష్ట్రాలు విపత్తు మరణంగా ప్రకటించాయి. విపత్తు సంభవిస్తే పరిహారం లభించినట్లే పాము కాటుకు గురై చనిపోయిన వ్యక్తి కుటుంబానికి పరిహారం చెల్లిస్తున్నాయి.

సాధారణంగా పాముకాట్లు వర్షాకాలంలోనే ఎక్కువగా జరుగుతుంటాయి. వర్షాలు కురవటంతో బొరియల్లోంచి బయటకు వచ్చిన పాములు జనావాసాల్లోకి వస్తుంటాయి. అలాగే వర్షం పడ్డాక రైతులు పొలం పనులకు వెళుతుంటారు. అటువంటి సమయంలో పాముకాట్లకు గురవుతుంటారు. సరైన సమయానికి వైద్యం అందకపోతే ప్రాణాలు పోతుంటాయి. అలా పాముకాట్లకు గురై ప్రాణాలు కోల్పోతే కొన్ని రాష్ట్రాలు చనిపోయిన వ్యక్తి కుటుంబానికి పరిహారం చెల్లిస్తున్నాయి.

Mann Ki Baat : మోదీజీ.. ముస్లింల మన్ కీ బాత్ వినండి.. ప్రధానికి ముస్లిం మత పెద్ద సూచన

కేరళలో విషపూరితమైన పాముకాటు వల్ల మరణిస్తే పరిహారం మృతుని కుటుంబానికి అందజేస్తారు. బీహార్ లో కూడా మృతుడి కుటుంబానికి రూ.4లక్షలు పరిహారం అందజేస్తోంది. ఉత్తరప్రదేశ్‌తో పాటు పలు రాష్ట్రాల్లో పాము కాటుతో చనిపోయిన వాళ్ల కుటుంబాలకు 4 లక్షల రూపాయల పరిహారం అందజేస్తున్నారు. పాము కాటుతో రైతు చనిపోతే రైతు బీమా పథకం కింద లక్ష రూపాయల పరిహారం అందజేస్తోంది. ఈ పరిహారం మొత్తాన్ని బాధిత కుటుంబానికి అందజేస్తారు అధికారులు.

పాము కాటుతో ఎవరైనా చనిపోతే ..వారి కుటుంబ సభ్యులు పరిహారం పొందవచ్చు. అలా పొందాలంటే పాముకాటుతో చనిపోయిన వ్యక్తి మతదేహానికి కచ్చితంగా పోస్టు మార్టం చేయించాలి. పోస్టు మార్టంలో పాముకాటుతో చనిపోయాడనే నిర్ధారణ జరగాలి. మృతుడ్ని పోస్ట్‌మార్టం రిపోర్ట్ చాలా చాలా ముఖ్యం అనే విషయం మర్చిపోవద్దు. ఆ రిపోర్టు ఆధారంగానే మృతుడి కుటుంబానికి పరిహార సహాయం అందుతుంది. అందుకే పాము కాటుతో చనిపోయిన వ్యక్తి మృతదేహానికి వెంటనే బంధువులు శవపరీక్షను నిర్వహించాలి. పాముకాటు వల్ల మరణిస్తే వెంటనే స్థానిక అధికారులకు తెలియజేయాల్సి అవరసం చాలా ఉందనే విషయం గుర్తించాలి.

International Lefthanders Day 2023 : ఎడమ చేతివాటానికి కారణమేంటో తెలుసా..? పరిశోధనల్లో ఆసక్తికర విషయాలు

కాగా..భారతదేశంలో అనేక రకాల విషపూరిత పాములు ఉన్నాయి. వాటిలో కింగ్ కోబ్రా అత్యంత ప్రమాదకరమైనపాము. ఈ పాము కాటుతో దేశంలో ప్రతీ ఏటా 64,000 మంది చనిపోతున్నారు. అంటే పాముకాటు భారత్ లో ఎంత ప్రమాదకారిగా మారిందో ఊహించుకోవచ్చు. అలా గత 20 సంవత్సరాల రికార్డులు చూస్తే ఒక్క భారతదేశంలోనే 1.2 మిలియన్లకు పైగా ప్రజలు పాముకాటుతో మరణించారు. 97శాతం మరణాలు గ్రామీణ ప్రాంతాల్లోనే జరిగాయి. పాముకాటు వల్ల ఆడవారికంటే మగవారే ఎక్కువగా మరణిస్తున్నారు. దీనికి కారణం మగవారే ఎక్కువగా వ్యవసాయ పనుల కోసం పొలాలకు వెళ్లటమే.